సెలవుల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా..! ఈ టిప్స్ తో పిల్లలని బిజీగా ఉంచండి..

మారిన కాలంతో పాటు పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కుడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉండడం ఎక్కువగా అలవాటు అయింది. చురుకు తక్కువగా ఉంటారు. పిల్లలు బయటకు వెళ్లకపోవడానికి మరో ప్రధాన కారణం వేడి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో పిల్లలను ఇంట్లోనే ఉంచడం మంచిది. పిల్లలు ఫోన్‌లు లేదా ఇతర గాడ్జెట్‌లతోనే ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

సెలవుల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా..! ఈ టిప్స్ తో పిల్లలని బిజీగా ఉంచండి..
Summer Vacation
Follow us

|

Updated on: May 28, 2024 | 12:22 PM

వేసవి కాలం వస్తే చాలు పిల్లలు సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వేసవి సెలవుల్లో స్నేహితులతో సరదాగా గడపడానికి, రకరకాల రుచికరమైన ఆహారాన్ని ఇష్టంగా తినడానికి నచ్చిన ఆటలు ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు. అయితే గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి గంటల తరబడి రకరకాల ఆటలు ఆడుకునేవారు. లేదా తమ తాతలు పెద్దలతో కలిసి శారీరక శ్రమ పడేవారు. దీంతో పిల్లలు మంచి ఫిట్‌నెస్ తో ఉండేవారు. మనసు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉండేవి. అయితే మారిన కాలంతో పాటు పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కుడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉండడం ఎక్కువగా అలవాటు అయింది. చురుకు తక్కువగా ఉంటారు. పిల్లలు బయటకు వెళ్లకపోవడానికి మరో ప్రధాన కారణం వేడి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో పిల్లలను ఇంట్లోనే ఉంచడం మంచిది. పిల్లలు ఫోన్‌లు లేదా ఇతర గాడ్జెట్‌లతోనే ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

ఈ పద్ధతి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ముప్పు. పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు ఒక సవాలు. వేసవి సెలవుల్లో ఈ చెడు అలవాటు నుంచి వారిని ఎలా దూరం చేయాలనేది ఇప్పుడు తల్లిదండ్రులకు ఎదురయ్యే పెద్ద ప్రశ్న.. ఎందుకంటే ఈ అలవాటు కంటి దృష్టిని కూడా బలహీనపరుస్తుంది. సెలవుల్లో పిల్లలను బిజీగా ఉంచడానికి చాలా ఉపయోగకరమైన కొన్ని మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

వేసవి సెలవుల్లో పిల్లలను ఎలా బిజీగా ఉంచాలంటే చదువులు, క్రీడలు, రకరకాల కార్యకలాపాలు, విశ్రాంతితో కూడిన టైమ్ టేబుల్‌ను పిల్లల కోసం రూపొందించండి. దీనివల్ల వారి దినచర్య సక్రమంగా సాగడంతోపాటు ఫోన్ ను ఉపయోగించే సమయం తక్కువ అవుతుంది.

ఇవి కూడా చదవండి

పిల్లలు ఫోన్‌కు బానిస అయితే ఆ ఫోన్ ను ఉపయోగించకుండా తక్కువ సమయం సెట్ చేయండి. ప్రతిరోజూ ఎంత సమయం ఫోన్‌ని చూడాలో నిర్ణయించాలి. ఇలా చేయడం వలన అనేక విషయాలను బేలెన్స్ చేసుకోవచ్చు.

పిల్లలకు ఫోన్‌లు కాకుండా ఆసక్తిని కలిగించే ఇతర వస్తువులను అందించండి. ఆడుకోవడానికి సాయంత్రం బయటకు పంపండి. చిన్న చిన్న కథలు ఉన్న పుస్తకాలు చదవడానికి వారిని ప్రేరేపించండి. లేదా వారికి కొత్త అభిరుచిని నేర్పండి.

కళలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలను భాగస్వామ్యం చేయడానికి వేసవి కాలం మంచి సమయం. పెయింటింగ్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ లేదా శిల్పం వంటి వాటిని తయరు చేసే విధంగా ప్రోత్సహించండి. ఇలా చేయడం వలన ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయగలరు. మంచి విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.

పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి తోటపని చేసే విధంగా పట్ల ఆసక్తిని పెంచండి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే పనిని మీ పిల్లలకు అప్పగించండి. ఇలా చేయడం వల్ల ప్రకృతికి దగ్గరవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

వంటగదిలో సులభంగా తయారు చేయగల కొన్ని వంటలను పిల్లలకు నేర్పండి. సలాడ్‌లను కత్తిరించడం, శాండ్‌విచ్‌లు సిద్ధం చేయడం లేదా బేకింగ్‌లో సహాయం చేయడం నేర్పండి.

ఈజీగా తయారు చేసే పనులను పిల్లలకు నేర్పించండి. చిన్నపాటి ప్రయోగాలు, కిట్‌లు లేదా మోడల్‌లను తయారు చేయడం నేర్పిస్తే పిల్లలు బిజీగా ఉంటారు. శాస్త్రీయ అవగాహనను కూడా పెంచుతుంది.

చివరిగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఫోన్‌కు పిల్లలకు దూరంగా ఉండటం ఎందుకు ముఖ్యమో వివరించడం. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా వేసవిలో పిల్లలను ఫోన్‌ వాడకానికి దూరంగా ఉంచవచ్చు. పిల్లలకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సెలవుదినాన్ని అందించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..