Energy Foods: ఊరికే అలిసిపోయినట్టు అనిపిస్తోందా.. వీటిని తింటే యాక్టీవ్ అవుతారు!
ఉదయం లేచింది మొదలు.. రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులకు శరీరం త్వరగా అలసిపోతూ ఉంటుంది. ఆ అలసట నుండి రిలీఫ్ పొందాలంటే.. శరీరానికి రెస్ట్ కావాలి. అదే విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా నొప్పులు వస్తూ ఉన్నాయంటే మాత్రం ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోయినా కూడా.. శరీరంలో నొప్పులు వస్తాయి. కాబట్టి గమనించు కోవడం అవసరం..

ఉదయం లేచింది మొదలు.. రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులకు శరీరం త్వరగా అలసిపోతూ ఉంటుంది. ఆ అలసట నుండి రిలీఫ్ పొందాలంటే.. శరీరానికి రెస్ట్ కావాలి. అదే విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా నొప్పులు వస్తూ ఉన్నాయంటే మాత్రం ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోయినా కూడా.. శరీరంలో నొప్పులు వస్తాయి. కాబట్టి గమనించు కోవడం అవసరం. అదే విధంగా ఎలాంటి ఆహారం తీసుకొంటున్నారో చూసుకోవాలి. తక్షణమే శరీరానికి సత్తువ, ఎనర్జీ లభించాలంటే కొన్ని ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. మరి అలసట దరి చేరకుండా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే.. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు:
కోడి గుడ్లు తినడం వల్ల నీరసం, అలసట దరి చేరకుండా ఉంటాయి. గుడ్లు పౌష్టికాహారంగా చెప్తారు. గుడ్లలో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, కోలిన్, ఐరన్, విటమిన్లు డి, బి12లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. రోజంతా శక్తిని కూడా అందిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తింటే త్వరగా అలసిపోకుండా ఉంటారు.
ఖర్జూరం:
ఖర్జూరం తినడం వల్ల కూడా త్వరగా అలసిపోకుండా ఉంటారు. ప్రతి రోజూ 2, 3 ఖర్జూరాలు తీసుకుంటే మంచి శక్తి అందుతుంది. ఇందులో రిచ్ ఫైబర్‌తో పాటు మంచి కొవ్వులు, ఫోలేట్, నియాసిన్స్ వంటివి లభిస్తాయి. ఇవి శరీరంలో జీవక్రియని పెంచి శక్తిని అందిస్తాయి. రోజూ ఖర్జూరాలు తినడం వల్ల అలసట అనేది దూరం అవుతుంది.
బీట్ రూట్:
బీట్ రూట్స్ తినడం వల్ల తక్షణమే శక్తి అందుతుంది. ఇందులో కూడా నైట్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచి.. కణాలను మెరుగ్గా చేస్తాయి. సరైన పోషకాలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. బీట్ రూట్‌ని సూప్స్, సలాడ్స్, కూరలు ఎలాగైనా తీసుకోవచ్చు.
అరటి పండ్లు:
అలసట దూరం చేసి.. తక్షణ శక్తిని అందించడంలో అరటి పండు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి బాగా అందుతుంది. వీటిల్లో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే పాలకూర, బాదం, పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా ఎనర్జీ లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








