AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Leaves for Face: జామాకులతో కేవలం ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా!

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో జామ కాయలు కూడా ఒకటి. యాపిల్‌లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. జామ కాయల్లో కూడా అన్నే పోషకాలు లభిస్తాయి. జామ కాయలో తింటే ఎంత ఆరోగ్యమో.. జామాకుల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటితో కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మ అందాన్ని పెంచడంలో జామాకులు కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. జామాకులతో చర్మంపై ఉండే మొటిమలు..

Guava Leaves for Face: జామాకులతో కేవలం ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా!
పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? రక్తస్రావం కూడా అవుతుందా? తరచుగా టాయిలెట్‌కి వెళ్లాలా? ఒకే ఒక్క ఆకుతో ఈ సమస్యలన్నింటినీ సహజంగా వదిలించుకోవచ్చు. అదే జామఆకు. అవును జామపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఒక పెద్ద జామపండులో ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. అయితే జామ పండ్లలోనే కాదు జామ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
Chinni Enni
|

Updated on: May 28, 2024 | 3:46 PM

Share

ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో జామ కాయలు కూడా ఒకటి. యాపిల్‌లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. జామ కాయల్లో కూడా అన్నే పోషకాలు లభిస్తాయి. జామ కాయలో తింటే ఎంత ఆరోగ్యమో.. జామాకుల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటితో కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మ అందాన్ని పెంచడంలో జామాకులు కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. జామాకులతో చర్మంపై ఉండే మొటిమలు, వృద్దాప్యం, ముడతలే కాకుండా పీహెచ్ స్థాయిల్ని కూడా చక్కగా మెయిన్‌టైన్‌ చేసుకోవచ్చు. చర్మ అందాన్ని పెంచడంలో జామాకులు ఎలా పని చేస్తాయి? జామాకుల్ని ఎలా వాడాలి? ఎలాంటి చర్మ సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలకు చెక్:

జామాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి మొటిమలకు కారనం అయ్యే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎండా కాలం కాబట్టి చాలా మంది మొటిమల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అాలాంటి వారు జామాకుల్ని గ్రైండ్ చేసి వచ్చిన రసాన్ని ముఖాన్ని రాయాలి. దీని వల్ల సెబమ్ స్రావం తగ్గి.. మొటిమలు అనేవి తగ్గుతాయి.

చర్మంపై వాపు తగ్గుతుంది:

చాలా మందికి చర్మంపై వాపులు అనేవి వస్తూ ఉంటాయి. బాడీలో హిస్టామిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. దీని కారణంగా వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించడంలో జామాకులు చక్కగా హెల్ప్ చేస్తాయి. లేత జామాకుల్ని ఆవు పాలతో గ్రైండ్ చేసి అప్లై చేయడం వల్ల చర్మ వ్యాధులు అనేవి దూరముతాయి.

ఇవి కూడా చదవండి

నలుపు పోతుంది:

ఎండలోకి బయటకు వెళ్లి రావడం, కంప్యూటర్, టీవీ, ఫోన్ వంటి స్క్రీన్స్‌ని ఎక్కువగా చూడటం వల్ల ముఖం అనేది నల్లగా మారుతుంది. దీని వల్ల నలుపు మచ్చలు అనేవి, డార్క్ స్పాట్స్ వస్తాయి. జామాకులతో వీటిని సైతం దూరం చేసుకోవచ్చు. జామాకుల్ని కొద్దిగా నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. వడకట్టి ఆ నీటితో ముఖాన్ని క్లీన్ చేస్తే ముఖంపై నలుపు అనేది తగ్గుతుంది.

యంగ్‌‌గా ఉండొచ్చు:

వయసు పెరిగే కొద్దీ ముఖంపై వృద్ధాప్య లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీటిని దూరం చేయడంలో జామాకులు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. ముఖంపై గీతలు, నల్లటి మచ్చలు, వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి. జామాకుల నుంచి రసం తీసి.. దీన్ని రెగ్యులర్‌గా ముఖానికి అప్లై చేస్తూ ఉంటే.. చర్మం యంగ్‌గా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..