Jerusalem : పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 2300 ఏళ్ల నాటి ‘బంగారు ఉంగరం’.. ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆభరణాల్లో బంగారం కంటే రాతితో అమర్చబడిన బంగారు ఆభరణాలనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవారని గుర్తించారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అలెగ్జాండర్ మాసిడోనియన్ సామ్రాజ్యం కింద ఉందని, జెరూసలేం నివాసులు హెలెనిస్టిక్ శైలి, ప్రభావానికి గురయ్యారని తాజా ఆవిష్కరణ వెల్లడిస్తుందని పరిశోధకులు తెలిపారు.

Jerusalem : పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 2300 ఏళ్ల నాటి ‘బంగారు ఉంగరం’.. ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Jerusalem
Follow us
Jyothi Gadda

|

Updated on: May 28, 2024 | 7:06 AM

ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో అరుదైన ఉంగరం దొరికింది. డేవిడ్ ఆర్కియోలాజికల్ పార్కులోని పురాతన వస్తువుల కోసం జరిపిన తవ్వకాల్లో హెలెనిస్టిక్ కాలం నాటి 2,300 ఏళ్ల నాటి ఓ చిన్నారి ఉంగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ (IAA) తెలిపింది. బంగారు ఉంగరం గోమేదికం అని పిలువబడే ఎర్రటి విలువైన రాయితో తయారు చేయబడింది. దీనిని అబ్బాయి లేదా అమ్మాయి ఎవరైనా ధరించవచ్చునని చెబుతున్నారు. ఈ ఉంగరాన్ని పురావస్తు శాస్త్రవేత్త తెహియా గంగాటే డేవిడ్ కనుగొన్నారు. రింగ్ సైజ్ చాలా చిన్నదిగా ఉండటంతో పరిశోధకులు అది పిల్లలకి చెందినదిగా భావించారు. సుమారు 300 BC నాటిదిగా అంచనా వేస్తున్నారు. వేల సంవత్సారాలు గడిచినప్పటికీ ఆ ఉంగరం ఏ మాత్రం చెక్కు చెదరకుండా, వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఎలాంటి మార్పుకు గురికి కాలేదని చెప్పారు.

IAA ప్రకటన ప్రకారం.. హెలెనిస్టిక్ కాలం 4వ శతాబ్దం చివరి నుండి 3వ శతాబ్దం BC ప్రారంభం వరకు.. ఆభరణాల్లో బంగారం కంటే రాతితో అమర్చబడిన బంగారు ఆభరణాలనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవారని గుర్తించారు. ఆ సమయంలో ఈ ప్రాంతం అలెగ్జాండర్ మాసిడోనియన్ సామ్రాజ్యం కింద ఉందని, జెరూసలేం నివాసులు హెలెనిస్టిక్ శైలి, ప్రభావానికి గురయ్యారని తాజా ఆవిష్కరణ వెల్లడిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఇకపోతే, ఈ కొత్త పరిశోధనలు భిన్నమైన కథను చెబుతున్నాయి. కాగా, జూన్ 4న జెరూసలేంలో జరిగే పురాతన వస్తువుల అథారిటీ సదస్సులో ఈ ఉంగరాన్ని ప్రజలకు ప్రదర్శించనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…