AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం పోయేకాలం రా.. బిజీ రోడ్డులో డివైడర్ పై బైక్ డ్రైవింగ్..

ఈ సందర్భంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై స్టంట్స్‌ చేశాడు. నది వంతెనపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై తన మోటార్‌బైక్‌ను ప్రమాదకరంగా నడుపుతూ కనిపించాడు. దీంతో పాటు మరికొందరు యువకులు కూడా అతడికి మద్దతుగా కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో నడుపుతున్నారు.

Viral Video: ఇదేం పోయేకాలం రా.. బిజీ రోడ్డులో డివైడర్ పై బైక్ డ్రైవింగ్..
Man drives bike on divider
Jyothi Gadda
|

Updated on: May 27, 2024 | 2:03 PM

Share

చేతిలో బైక్ ఉంటే చాలు.. కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. భయంకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు రిస్క్‌లో పెడుతుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా. సాధారణంగా వాహనాలు రోడ్డుపై వెళ్తుంటాయి. కానీ, రోడ్డు డివైడర్‌పై ఎవరైనా డ్రైవింగ్ చేయడం ఎప్పుడైనా,ఎక్కడైనా చూశారా..? కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి స్టంట్‌ చేస్తున్న వ్యక్తి వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇక్కడ ఒక యువకుడు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై ప్రమాదకరంగా బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడు లోని తిరుచ్చి లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెల 23న పెరుంబిడుగు ముత్తురైయార్‌ జయంతి సందర్భంగా ఆ సంఘానికి చెందిన పలువురు యువకులు తిరుచ్చిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై స్టంట్స్‌ చేశాడు. కొల్లిడం నది వంతెనపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై తన మోటార్‌బైక్‌ను ప్రమాదకరంగా నడుపుతూ కనిపించాడు. దీంతో పాటు మరికొందరు యువకులు కూడా అతడికి మద్దతుగా కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో నడుపుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అటుగా వెళ్తున్న స్థానికులు యువకుడి బైక్‌ స్టంట్‌ను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే