కాశీ వారణాసి యాత్రకు వెళ్తున్నారా..? తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసా? ఆ అనుభవాలు మిస్ అవ్వకండి..
ఈ నగరం అత్యంత ముఖ్యమైన ఆకర్షణలలో ఇది ఒకటి. పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం, సూర్యోదయం చూడడం మనసుకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పడవ ప్రయాణం చేస్తూ ఒక ఘాట్ నుంచి మరో ఘాట్ కు చేరుకోవచ్చవు. వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో వారణాసి ఒకటి. మీరు వారణాసిని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు తప్పక చేయాల్సిన పనులు, చూడాల్సిన ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకోవటం మంచిది. పవిత్ర నగరమైన కాశీని సందర్శించినప్పుడు మీరు వాటిని తప్పక చేయాలి. వారణాసి దాని ప్రాచీన సంస్కృతి, చరిత్ర, వాస్తుశిల్పం, జ్ఞానం, ఆహారానికి ప్రసిద్ధి చెందింది. గంగా నది నుండి కాశీ విశ్వనాథ దేవాలయం వరకు, వారణాసిలో ఆధ్యాత్మికత అత్యుత్తమమైనది. క్కడ ప్రధాన ఆకర్షణగా రామ్ నగర్ దుర్గ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ది ఘాట్స్ ఆఫ్ వనరాసి, సెయింట్ మేరీ చర్చి, భారత్ కాలా మ్యూజియం ఉన్నాయి. ఇవన్నీ దేనికదే.. ఒకొక్క విశిష్టతను కలిగి పర్యాటకులకు ఆకట్టుకునేలా ఉంటాయి. అలాంటి వారణాసిలో చేయవలసిన పనులు..
గంగా హారతి చూడండి..
వారణాసిలో గంగా ఆరతి మీ జీవితంలో మీరు పొందగలిగే అత్యంత మంత్రముగ్దులను చేసే అనుభవాలలో ఒకటి. వారణాసిలోని అన్ని ప్రధాన ఘాట్‌లలో గంగా ఆరతి నిర్వహిస్తారు. ఈ అపురూపమైన ఘట్టం గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అద్భుతమైన దృశ్యాలను తిలకించిన ఆధ్యాత్మికత కలగజేస్తోంది. అయితే దశాశ్వమేధ ఘాట్‌లోని ఆరతి దాని గొప్పతనాన్ని అనుభవించడానికి విలువైనది.
కాశీ విశ్వనాథుని ఆశీస్సులు..
వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కాబట్టి, మీరు వారణాసిని సందర్శించాలనుకుంటే, ముందుగా శివుని ఆశీర్వాదం పొందండి.
గంగా నది
గంగా నదిలో పడవ ప్రయాణం.. వారణాసిలో గంగానదిలో బోటింగ్ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నగరం అత్యంత ముఖ్యమైన ఆకర్షణలలో ఇది ఒకటి. పడవ మీద ప్రయాణిస్తూ సూర్యాస్తమయం, సూర్యోదయం చూడడం మనసుకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. పడవ ప్రయాణం చేస్తూ ఒక ఘాట్ నుంచి మరో ఘాట్ కు చేరుకోవచ్చవు. వారణాసిలో గంగానదిలో పడవ ప్రయాణం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
తులసి మానస్ మందిర్‌ను సందర్శించండి..
ముత్యాల తెల్లటి ముఖభాగం, పచ్చని తోట తులసి మానస్ మందిర్ వారణాసిలో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. మీరు ఈ ఆలయంలో సాయంత్రం విహారయాత్ర చేయవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.
గోడోలియా మార్కెట్..
వారణాసిలో షాపింగ్ చేయడం దాని మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలకే కాకుండా ఇక్కడ బట్టలు, చీరల మార్కెట్ ప్రసిద్ధి చెందింది. గోడోలియా వారణాసిలోని ప్రముఖ మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ మీకు బనారసీ చీరల నుండి సూట్లు, ఆభరణాల వరకు సరసమైన ధరలలో లభిస్తాయి.
రామనగర కోటను సందర్శించండి..
వారణాసిలోని రామనగర కోట ఒక నిర్మాణ అద్భుతం. అది ఇప్పుడు మ్యూజియంగా పనిచేస్తుంది. ఇది గంగా నది ప్రశాంత ఒడ్డుకు సమీపంలో ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు