AP Elections: ఏపీలో ఎవరు గెలుస్తారని మాయ రోబోను అడిగిన తెలుగు వ్యక్తి.. తన ఆన్సర్ ఇదే
ఏపీలో ఎవరు గెలవబోతున్నారు.. జగన్ అధికార పీఠంపై కొనసాగుతారా...? చంద్రబాబు పాలనా పగ్గాలు చేపడతారా..? ఏ పార్టీ కార్యకర్తలు.. వారి పార్టీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే అందరిలో అదే సస్పెన్స్ అయితే ఉంది. ఎవరూ గట్టిగా కాలర్ ఎగరేసి మా పార్టీదే విజయం అని చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో మాయ అనే రోబోను కూడా ఇదే ప్రశ్న అడిగాడు ఓ తెలుగు వ్యక్తి. దానికి తన ఆన్సర్...
ఏపీలో గెలిచేది ఎవరు?… తలలు పండిన సెఫాలిజిస్టులు, రాజకీయాల్ని అవపోసన పట్టిన ఎనలిస్టులు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆంధ్రాలో ఓటర్ ఎటువైపు మొగ్గు చూపాడో.. ఈవీఎం బాక్సుల్లో దాగున్న నిజం ఏంటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏ సంస్థ అయినా సరే, సర్వే చేసి… ఇదిగో రిజల్ట్ అని లీక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేకపోతుంది. ఓటు వేసిన ప్రజలేమో, ఏ పార్టీ వాళ్లు అడిగినా… మీకే ఓటు వేశాం అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలోనే కాదు, దేశంలో, ప్రపంచంలో ఏ ఇద్దరు తెలుగు వాళ్ల మధ్య మాటలు జరిగినా.. కచ్చితంగా ఓ టాపిక్ గెలిచేది ఎవరనే. మే 13 సాయంత్రం నుంచి ఇది మిలియన్ డాలర్ ప్రశ్న మాత్రమే కాదు.. నరాలు తెగే ఉత్కంఠ కూడా. ఈ ఉత్కంఠను ఛేదించి కనీసం క్లూ అయినా దొరుకుతుందేమోనని ఓ ఔత్సాహికుడు ఏకంగా మాయనే క్వశ్చన్ చేశారు.
ఇంతకీ మాయ అంటే మీకు తెలుసా.. ! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే మాయకు ఈ ప్రపంచంలో తెలియనిది అంటూ లేదు. వంకాయ బజ్జీ నుంచి విమానాల తయారీ వరకూ దేని గురించి అయినా చెప్పేస్తుంది. అలాంటి ఈ మాయని ఏపీలో గెలిచేది ఎవరు అని అడిగాడు ఓ తెలుగు వ్యక్తి. మరి మాయ ఏం ఆన్సర్ చెప్పిందో తెల్సా..? అదే ప్రశ్న తన మెదడునూ తొలిచేస్తోంది అన్నట్లు ఆన్సర్ ఇచ్చింది.
ఒకవేళ నాకే దానికి ఆన్సర్ తెలిసి ఉంటే, కచ్చితంగా సీక్రెట్‌గానే ఉంచుతా.. అంటోంది మాయ. ఇందులో రెండు కోణాలు. ఒకటి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. ఇక రెండో మాట.. ఒకవేళ నాకు దాని ఆన్సర్ తెలిసి ఉంటే.. అంటోంది. అంటే తెలీదన్నమాట. ఏపీలో గెలిచేది ఎవరో.. AIకి కూడా అంతుచిక్కడం లేదన్నమాట. !
ఈ మాయ.. దుబాయ్‌లో ఉంది. అక్కడి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అనే ప్లేస్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. AIతో పనిచేసే ఈ రోబోని ఎవరు ఏ ప్రశ్న అడిగినా, చేతులు ఊపుతూ, హావభావాలు చూపిస్తూ ఆన్సర్ ఇచ్చేస్తోంది. ప్రపంచంలో ఏ ప్రశ్న అడిగినా సరే.. ఆన్సర్ చెప్పడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. కానీ ఒక్క ఏపీలో గెలిచేది ఎవరంటే మాత్రం నాకు తెలిసున్నా కూడా చెప్పేదాన్ని కాదంటోంది. అంటే AIకి కూడా అంతుచిక్కని రహస్యం EVMలలో దాగి ఉంది. ఆ నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4వరకూ ఆగాల్సిందే!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..