అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ సెకండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు.. ఎక్కడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.!

అవును, ఈ జంట రెండవ సారి ప్రీ వెడ్డింగ్‌ నిర్వహించుకుంటుంది. దీని కోసం అంబానీ-మర్చంట్ ఇద్దరూ ఫ్లైట్ ఎక్కారు. ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. వీటన్నింటి మధ్య ఇప్పుడు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ సెకండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు.. ఎక్కడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.!
Anant Ambani and radhika merchant
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2024 | 12:38 PM

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అతను ఈ సంవత్సరం జూలైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో వివాహం చేసుకోబోతున్నాడు. అయితే అంతకు ముందు అంబానీ కుటుంబం వధూవరుల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను నిర్వహించింది. అవును, ఈ జంట రెండవ సారి ప్రీ వెడ్డింగ్‌ నిర్వహించుకుంది. దీని కోసం అంబానీ-మర్చంట్ ఇద్దరూ ఫ్లైట్ ఎక్కారు. ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. వీటన్నింటి మధ్య ఇప్పుడు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇటలీలో క్రూయిజ్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి ముఖేష్ అంబానీ తన కొడుకు, కాబోయే కోడలు కోసం అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రూయిజ్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో అంబానీ కుటుంబం సముద్రం మధ్యలో ఈ వేడుక జరుపుకుంటారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ రెండవ ప్రీ-వెడ్డింగ్ కార్డ్ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో ఫంక్షన్ మే 29 నుండి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతుందని చెప్పబడింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ఈ కార్డును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి
Anant Ambani and radhika merchant second pre wedding card

ఈ కార్డు ప్రకారం, అతిథులందరూ ఇటలీలోని సిసిలీలోని పలెర్మోలో ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కావాలి. మే 29న అందరూ కలిసి క్రూయిజ్‌లో చేరతారు. ఈ సమయంలో క్రూయిజ్‌లోని ఫంక్షన్‌లు వెల్‌కమ్ లంచ్ థీమ్‌తో ప్రారంభమవుతాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి