AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పైచదువులకోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో భారతీయ యువతి చనిపోయింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య (25) మృతి చెందింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికు చెందిన కోటేశ్వరరావు సిఆర్పిఎఫ్ జవాన్‎గా పనిచేశాడు. యాదగిరిపల్లెలో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ కూతురు, కొడుకును చదివించారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పైచదువులకోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
America
M Revan Reddy
| Edited By: |

Updated on: May 27, 2024 | 3:18 PM

Share

ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు పలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో భారతీయ యువతి చనిపోయింది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌమ్య (25) మృతి చెందింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని యాదగిరిపల్లికు చెందిన కోటేశ్వరరావు సిఆర్పిఎఫ్ జవాన్‎గా పనిచేశాడు. యాదగిరిపల్లెలో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ కూతురు, కొడుకును చదివించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు సౌమ్య చదువులో చురుకుగా ఉండేది. రెండేళ్ల క్రితం అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో సామ్యకు ఎమ్మెస్‎లో సీటు వచ్చింది. కూతురు చదువు కోసం కోటేశ్వరరావు అప్పులు చేసి అమెరికా పంపించాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన సౌమ్య కన్సల్టెన్సీ ద్వారా జాబ్ సెర్చింగ్ చేస్తోంది. నిన్న కూరగాయల కోసం బయటికి వెళ్లిన సౌమ్యను వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.

సౌమ్య మృతి వార్తతో యాదగిరి పల్లెలో విషాదం నెలకొంది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈనెల 11వ తేదీన 25వ బర్త్ డే ను సౌమ్య జరుపుకుందని తండ్రి కోటేశ్వరావు చెబుతున్నారు. ఈ బర్త్ డే వేడుకల కోసం ఇండియా నుండి బట్టలు పంపానని చెబుతున్నాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తన కూతురు విగతజీవిగా మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఆమె డెడ్ బాడీని వీలైనంత త్వరగా భారత్‎కు తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలను తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
మురాసు తుఫాన్‌ ఎఫెక్ట్‌పై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
మురాసు తుఫాన్‌ ఎఫెక్ట్‌పై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ధంతేరస్ రోజున ఈ టైమ్‌లో గోల్డ్ కొంటే మంచిది..? మంచి ముహూర్తం ఇదే.
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు
ఒక టీచర్.. 5 తరగతులు.. ఒకే గది: మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నదెవరు