Heavy Temperatures: ఈ దేశానికి ఏమైంది.. అక్కడి ఎండలకు మంటెత్తిపోతున్న ప్రజలు.. అప్పటి వరకు ఇంతే..

ఏపీ, తెలంగాణ, బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే అక్కడ మాత్రం సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతల విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.

Heavy Temperatures: ఈ దేశానికి ఏమైంది.. అక్కడి ఎండలకు మంటెత్తిపోతున్న ప్రజలు.. అప్పటి వరకు ఇంతే..
Heavy Temperatures
Follow us
Srikar T

|

Updated on: May 27, 2024 | 9:02 AM

ఏపీ, తెలంగాణ, బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటే అక్కడ మాత్రం సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతల విషయంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అందులో ఏడారి రాష్ట్రం రాజస్థాన్ కూడా ఉంది. ఎండ వేడికి రాజస్థాన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభమైన వేళ.. రాష్ట్రంలో వేడిగాలులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎండ ధాటికి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వేడిగాలుల ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఫలోడిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రాజస్థాన్‌లోని పలు నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఫలోడి తర్వాత బార్మర్‌లో 48.2 డిగ్రీలు, జైసల్మేర్‌లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. మే 28 తర్వాత వేడిగాలుల ప్రభావం తగ్గుతుందని వెల్లడించింది. 19 మే 2016న ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత శుక్రవారం 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై గత 6 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు పలు సూచనలు పాటించాలన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆసుపత్రుల్లో నిత్యావసర మందులు, పని ప్రదేశాల్లో తాగునీరు, ప్రధాన కూడళ్లలో ప్రజలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని ఆదేశించింది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిస్థితి ఇదే రకంగా ఉంది. ప్రజలు ఎండల తీవ్రతకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదైనా పని మీద బయటకు వచ్చినవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో 10 రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌ లోని కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర భారతంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్‌ , ఢిల్లీ , పంజాబ్‌ , హర్యానా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోయాయి. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాజస్థాన్‌ లోని ఎడారి ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజుల పాటు రాజస్థాన్‌లో హీట్‌ వేవ్‌ కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. జైసల్మేర్‌ , చురు , బికనేర్‌ , గంగానగర్‌ , జోధ్‌పూర్‌ నగరాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మంచినీటిని ఎక్కువగా తాగాలని ప్రజలకు వైద్యులు సూచించారు. మధ్యప్రదేశ్‌ , గుజరాత్‌ , మహారాష్ట్ర , హర్యానా , ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. పగటి వేళ్లల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ప్రజలు ఎండల తీవ్రతకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదైనా పని మీద బయటకు వచ్చినవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల బాధ అయితే వర్ణణాతీతం. మరో 10 రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఢిల్లీలో సాయంత్రం వేళల్లోనే ఎక్కువ మంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఆటోవాలాలు కూడా ఎండల తీవ్రతకు చాలా కష్టాలు పడుతున్నారు. తమకు గిరాకీలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…