AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ‘ఇండియా కూటమికి ఓటేస్తే వృధా’.. ఎన్నికల ప్రచారంలో పీఎం మోదీ..

లోక్‌ సభ తుదిదశ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కీలకమైన యూపీలో జోరుగా ప్రచారం చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చి మతప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇండియా కూటమి కుట్ర చేసిందన్నారు. అయితే మూడోసారి కూడా మతరాజకీయాలు చేసి అధికారం లోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక కౌంటరిచ్చారు.

PM Modi: 'ఇండియా కూటమికి ఓటేస్తే వృధా'.. ఎన్నికల ప్రచారంలో పీఎం మోదీ..
Pm Modi
Srikar T
|

Updated on: May 26, 2024 | 8:55 PM

Share

లోక్‌ సభ తుదిదశ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కీలకమైన యూపీలో జోరుగా ప్రచారం చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చి మతప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇండియా కూటమి కుట్ర చేసిందన్నారు. అయితే మూడోసారి కూడా మతరాజకీయాలు చేసి అధికారం లోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక కౌంటరిచ్చారు. లోక్‌ సభ ఎన్నికల తుదిదశ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్‌లో ఆయన సుడిగాలి ప్రచారం చేశారు. జూన్‌ 1వ తేదీన తుదిదశ పోలింగ్‌ జరుగుతుంది. అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటికలలు కంటున్నారని విమర్శించారు. నష్టాల్లో ఉన్న షేర్లతో ఇండియా కూటమిని పోల్చారు మోదీ. నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్లను ఎవరు కొనరని , ఇండియా కూటమికి ఓటేసిన వృధా అవుతుందని విమర్శించారు. చాయ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ. బాల్యంలో తాను ప్లేట్లు కడిగానని , రైలులో చాయ్‌ అమ్మానని తెలిపారు మోదీ.

ఇప్పటికి కూడా తనకు చాయ్‌ అంటే చాలా ఇష్టమన్నారు. ఉదయం కమలం వికసిస్తుందని , అదే సమయంలో అందరూ టీ తాగుతారని అందుకే బీజేపీకి దీంతో ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా రాజ్‌ నడిచిందన్నారు మోదీ. యోగి సీఎం అయ్యాక మాఫియాపై ఉక్కుపాదం మోపారని , శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. మిర్జాపూర్‌ సభలో కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌కు మద్దతుగా మోదీ ప్రచారం చేశారు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర చేస్తోందన్నారు మోదీ. అయితే ప్రధాని విమర్శలకు ఘాటైన కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ. పంజాబ్‌లో ఆమె ప్రచారాన్ని హోరెత్తించారు. చండీఘడ్‌ , పాటియాలాలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు ప్రియాంక. మతరాజకీయాలు చేసి ప్రధాని మోదీ రెండుసార్లు అధికారం లోకి వచ్చారని , ఇప్పుడు కూడా అదే పంథాను ఎంచుకున్నారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారని అన్నారు ప్రియాంక.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…