Cyclone Remal: దూసుకొస్తోన్న రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉందంటే

తీవ్ర తుఫాన్‌గా బలపడిన రెమాల్ బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటబోతోంది. తుఫాన్‌ ప్రభావంతో గంటకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున NDRF సిబ్బంది రంగంలోకి దిగింది. ఇక.. రెమాల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఏడుగురు మృతిచెందడంతో నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.

Cyclone Remal: దూసుకొస్తోన్న రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉందంటే
Cyclone Remal
Follow us

|

Updated on: May 26, 2024 | 8:34 PM

బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇప్పటికే.. తీవ్ర తుఫాన్‌గా మారిన రెమాల్.. పశ్చిమబెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక.. రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో.. నాగర్‌కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా.. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దఅంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడలో వర్షం కురిసింది. కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పెద్దపెద్ద చెట్లు కూలిపోయాయి. ఇక.. షామీర్‌పేటలో గాలి దుమారానికి చెట్టు విరిగి పడడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షం, చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

అటు.. రెమాల్‌ తీవ్ర తుఫాన్‌ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ.. పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో.. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. ఇక.. తీవ్ర తూఫాన్‌ ఎఫెక్ట్‌తో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాహనదారులను కెరటాలు ముంచెత్తుతుండడంతో బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. అటు.. రెమాల్ తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురు గాలులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. వంటింటి చిట్కాలు మీ కోసం
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
3 జట్లతో టీమిండియా సూపర్ 8 పోరు.. ఏ జట్టుపై రికార్డు ఎలా ఉందంటే?
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..
అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు..