అయితే ఎక్కడ అంకాపూర్ చికెన్ తిన్న అంకాపూర్ గ్రామానికి వెళ్లి తింటే ఆ కిక్కే వేరు. వేడివేడిగా వడ్డించే చికెన్‌తో పాటు మొక్క జొన్న గారెలు, జొన్న రొట్టెలు, ఆ తర్వాత వైట్ రైస్ ఇది కాంబినేషన్. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ అంకాపూర్ చికెన్ వండుతున్న కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే అంకాపూర్ చికెన్ కర్రీ ఎక్కడ కూడా ఫుల్, హాఫ్ అంటూ ప్లేట్ల లెక్కన అమ్మరు. కోడికి కోడి కట్ చేసి దాంతో వచ్చిన కర్రీ మొత్తాన్ని ఒక ప్యాకేజీగా అమ్మేస్తారు. ఇది కేవలం అంకాపూర్ గ్రామంలోనే కాదు ఈ నాటుకోడి కర్రీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా ఇదే సిస్టం.