AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బీజూ జనతాదళ్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు’.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు ఓటు వేయని తల్లులు, అక్కచెల్లెల్లు, చిన్న పిల్లలు, ఆడబిడ్డలపై ఆ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడతారన్నారన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. తాజాగా జరిగిన బీజూ జనతాదళ్ కార్యకర్తల వేధింపుల ఘటనను ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో వివరించిన వీడియోను షేర్ చేశారు.

'బీజూ జనతాదళ్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు'.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Srikar T
|

Updated on: May 26, 2024 | 5:50 PM

Share

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు ఓటు వేయని తల్లులు, అక్కచెల్లెల్లు, చిన్న పిల్లలు, ఆడబిడ్డలపై ఆ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడతారన్నారన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. తాజాగా జరిగిన బీజూ జనతాదళ్ కార్యకర్తల వేధింపుల ఘటనను ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో వివరించిన వీడియోను షేర్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. దీనిపై స్పందించని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‎ను నిస్సహాయ వ్యక్తిగా అభివర్ణించారు. ఇదీ నవీన్ పట్నాయక్ పరిపాలనలో మహిళలకున్న హోదా, గౌరవం అని ఎద్దేవా చేశారు. ఎవరైనా తమకు అనుకూలంగా ఓటు వేయలేదని తెలిస్తే బిజూ జనతాదళ్ వారు తల్లులను, కూతుళ్లను, అక్కాచెల్లెళ్లను కొట్టి తమ దర్పం చూపారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్య హక్కులు బలవంతంగా హరించబడతాయన్నారు. ఇక్కడ అమ్మాయిల పరిస్థితి కూడా అంతే అని నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ పాలనా వైఫల్యం అని మండిపడ్డారు.

నవీన్ పట్నాయక్‌ను అతని సన్నిహితులు ఇలా చేతగాని పాలన అందించేలా మార్చారన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహిళా శక్తిని కించపరిచి పైశాచిక ఆనందం అనుభవించే అనైతిక ప్రవర్తనను ఒడిశా ప్రజలు అంగీకరించరని తెలిపారు. నవీన్‌బాబుకు, బిజూ జనతాదళ్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒడిశా డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిజూ జనతాదళ్ రౌడీలను అరెస్ట్ చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు. ఒడిశాలో గత 25 ఏళ్లుగా బిజూ జనతాదళ్ అధికారంలో ఉందని.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 21 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…