Anant Ambani: అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..

Anant Ambani: అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..

Anil kumar poka

|

Updated on: May 26, 2024 | 6:07 PM

దేశంలోనే అత్యంత అరుదైన కళ... దక్షిణాదికే వన్నె తీసుకొస్తున్న కళాకారులు. కరీంనగర్ అనగానే ప్రసిద్దికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రి... దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్ట్ కు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న ఈ కళాకృతులను ఆదరించే వారు అంతంత మాత్రమే అయినా ఆర్టిస్టులు వెనకడుగు వేయలేదు.

దేశంలోనే అత్యంత అరుదైన కళ… దక్షిణాదికే వన్నె తీసుకొస్తున్న కళాకారులు. కరీంనగర్ అనగానే ప్రసిద్దికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రి… దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్ట్ కు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న ఈ కళాకృతులను ఆదరించే వారు అంతంత మాత్రమే అయినా ఆర్టిస్టులు వెనకడుగు వేయలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఉందన్న విషయం తెలిసినప్పటికీ అనుకున్నంత మార్కెటింగ్ మాత్రం లేదు. కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఫిలిగ్రీ కళ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఈ కళకు జీవం పోసినట్టయింది. జీ 20 దేశాల సమావేశం భారత్ లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుండి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోణార్క్ సూర్యదేవాలయంలో ఏర్పాటు చేసిన కాలచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆశించినరీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. జి 20 దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కరీంనగర్ ఫిలిగ్రీకి కళాకారులకు కూడా అవకాశం లభించింది.

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్మామిలీ కూడా వినడంతో దాదాపు ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబాని మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈక్రమంలో కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న సిల్వర్ పిలిగ్రీ కళాకృతుల నమూనాలు పంపిస్తున్నామని సిఫ్కో ప్రతినిధి అశోక్ తెలిపారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుండి కూడా అంబాని ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని వివరించారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నామని వివరించారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చారని, వారి కుటుంబ సభ్యులు ఎంచుకున్న డిజైన్లలో తీర్చిదిద్దే పనిలో కళాకారులు నిమగ్నం అయ్యారని తెలిపారు. సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పడడంతో ఈ కళకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. దాంతో కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తోంది… కరీంనగర్ ఖ్యాతి ఖండంతరాలకు పాకుతోంది. అంబాని కుటుంబం నుంచి పెళ్లికి కావలసిన గిఫ్ట్స్‌ ఆర్డర్స్ రావడం.. ఇక్కడి నుంచి గిఫ్ట్ లు తీసుకెళ్లడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.