Viral Video: అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌. వైరల్‌ వీడియో

చట్టాలు ఎంత బలంగా ఉన్నా, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చట్టాలను బేకాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ శివారులో కొందరు యువకులు ఆర్టీసీ బస్సుపై చేసిన దాడి అందరికీ తెలిసిందే. సైడ్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏకంగా యాభై మంది యువకులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన సంచనలంగా...

Viral Video: అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. సినిమాను తలపించేలా గ్యాంగ్‌ వార్‌. వైరల్‌ వీడియో
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: May 26, 2024 | 10:59 AM

చట్టాలు ఎంత బలంగా ఉన్నా, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చట్టాలను బేకాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ శివారులో కొందరు యువకులు ఆర్టీసీ బస్సుపై చేసిన దాడి అందరికీ తెలిసిందే. సైడ్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏకంగా యాభై మంది యువకులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన సంచనలంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమాను తలదన్నేలా ఉంది.

అర్థరాత్రి సమయంలో కొందరు యువకులు రోడ్లపై చేసిన రచ్చ అందరినీ షాక్‌కి గురి చేసింది. రెండు కార్లను పరస్పరం ఢీకొడుతూ, కర్రలతో దాడి చేసుకుంటూ, కారుతో ఢీకొడుతూ నానా హంగామా చేశారు. మే 18వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉడిపి – మణిపాల్‌ హైవేపై చోటు చేసుకుంది. రెండు కార్లలో వచ్చిన యువకులు వీరంగం సృష్టించారు.

వైరల్‌ వీడియో..

ఇదంతా అక్కడే అపార్టెంట్‌లో నివసిస్తున్న కొందరు స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో నలుగురి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగుల మధ్య నెలకొన్ని ఆర్థికపరమైన వివాదాల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..