AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Wedding: అదుర్స్ కదూ..! అనంత్ అంబానీ వివాహానికి విశాఖవాసి “చిరు” కానుక..

భారత అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే మార్చి నెలలో అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Anant Ambani Wedding: అదుర్స్ కదూ..! అనంత్ అంబానీ వివాహానికి విశాఖవాసి చిరు కానుక..
Anant Ambani Wedding Gift
Eswar Chennupalli
| Edited By: Balaraju Goud|

Updated on: May 26, 2024 | 1:05 PM

Share

భారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి విశాఖవాసి చిరు కానుకను సిద్ధం చేశారు. మే నెల 28 నుంచి 30 వరకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ వివిధ దేశాలలో జరగనుంది. వీరి వివాహాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన, అరుదైన బహుమతిని వారి కోసం సిద్ధం చేశారు.

చిరుధాన్యాలతో అనంత్ అంబానీ, రాధిక మచ్చంట్‌ల చిత్రపటాన్ని విజయ్ కుమార్ తయారు చేశారు. దాదాపు పది రోజులు శ్రమించి వీరిరువురి చిత్రపటాన్ని మిల్లెట్స్‌తో ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. త్వరలో ఈ చిత్రపటాన్ని అనంత్ అంబానీకి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారత్ లో జరిగిన వీరి తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేకమంది అతిధులు పాల్గొనడం, ప్రపంచవ్యాప్తంగా దీనిని కోట్లాది మంది వీక్షించడం జరిగింది. అది చూసిన విజయ్ కుమార్ తనదైన శైలిలో తాను నిపుణత సాధించిన చిత్రకళా రంగంలో ఒక అపురూపమైన బహుమతి సిద్ధం చేయాలని ఆలోచన చేశారు. ఆ దిశగా పనిచేస్తూ మిల్లెట్స్‌తో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంట భారీ చిత్రపటాన్ని తయారు చేశారు. గత ఏడాది కాలంగా విజయ్ కుమార్ మిల్లెట్స్ తో వందలాది చిత్రాలను తీర్చిదిద్దారు.

రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు

భారత అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే మార్చి నెలలో అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన తీరును అందరం వీక్షించాం. ఇప్పుడు మరోసారి ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మూడు రోజుల పాటు ఈ వేడుకలు బీచ్‌లో లో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయట.

మొదటిసారి వేడుకలు మన దేశంలోనే జరగ్గా.. ఇప్పుడు విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మే 28-30 తేదీల్లో రెండోసారి అనంత్- రాధికా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.

పెళ్లి ఖర్చు రూ. 1259 కోట్లు..?

అనంత్ అంబానీ – రాధికల వివాహానికి 1,259 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వివాహ వేడుకలు ప్రారంభం కావడం నుంచి ముగిసే వరకు మొత్తం రూ.1,200 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. దీని విలువ 130 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుంది. దీంతో అత్యంత ఖరీదైన పెళ్ళిగా అనంత్ అంబానీ – రాధికల వివాహం నిలవనుందట. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమిల్ వివాహం కోసం రూ. 700 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదిలావుంటే, ప్రిన్స్ ఛార్లెస్ – ప్రిన్సెస్ డయానా వివాహం ఇప్పటివరకు అత్యంత ఖరీదైనదిగా ఉంది. వారి వివాహానికి రూ. 916 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం రూ. 1,259 కోట్లతో అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం ఆ రికార్డును అధిగమిస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన వివాహంగా అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వివాహం రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఎంతైనా ఆయినా వారి మ్యారేజ్ అంటే అంతేగా మరి!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…