AIIMS-Rishikesh: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వ్యాన్.. నిందితుడు అరెస్ట్.
ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లడం పేషంట్లను వారి అటెండర్లను షాక్‌కు గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. సర్జరీ యూనిట్‌లో డ్యూటీలో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడంటూ రెండు రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించింది.
ఓ నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లడం పేషంట్లను వారి అటెండర్లను షాక్‌కు గురి చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. సర్జరీ యూనిట్‌లో డ్యూటీలో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించాడంటూ రెండు రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించింది. ఆ తర్వాత అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై ఇతర డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిందితుడిని డ్యూటీ నుంచి తొలగించాలని గురువారం నిరసన చేపట్టారు. నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేరుకోగా.. బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసారు. తమ వాహనంతో నేరుగా ఆరో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం నిందితుడిపై సస్పెన్షన్ వేటు వేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.