Harassing: కార్మికురాలిని లైంగికంగా వేధించిన శానిటేషన్ సూపర్‌వైజర్‌పై వేటు..
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గాజులరామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. శానిటేషన్ వర్కర్‌ను లైంగికంగా వేధించిన ఒక సూపర్‌వైజర్‌ను.. అతనికి సహకరించిన మరో సూపర్ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. గాజులరామారం మెడికల్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇద్దర్నీ టర్మినేట్ చేశారు.
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గాజులరామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. శానిటేషన్ వర్కర్‌ను లైంగికంగా వేధించిన ఒక సూపర్‌వైజర్‌ను.. అతనికి సహకరించిన మరో సూపర్ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. గాజులరామారం మెడికల్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇద్దర్నీ టర్మినేట్ చేశారు. గాజులరామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కిషన్.. తన కింద పని చేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేసి.. లైగికంగా వేధించాడు. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించాడు. ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకుని ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆమెను లొంగదీసుకుని.. ప్రతి రోజు పనికి రాగానే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలు పెట్టాడు కామాంధుడు కిషన్. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని తన ఫోన్లో చిత్రీకరించి.. శునకానందం పొందాడు.
పై అధికారి కావడంతో వేధింపులు గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక భరిస్తూ వచ్చింది ఆ కార్మికురాలు. కానీ.. కిషన్ సెల్ఫోన్లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి చేరగా.. అతన్ని ప్రశ్నించారు. దాంతో.. ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కామాంధుడు కిషన్. అయితే.. చివరికి.. పాపం పండి.. కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై టీవీ9 కథనాలతో అధికారులు స్పందించారు. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్‌తోపాటు.. అతనికి సహకరించిన మరో సూపర్‌వైజర్ ప్రణయ్‌ను సస్పెండ్ చేశారు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు. ఇక.. కూకట్‌పల్లి పరిధిలో ఒక మహిళ IAS అధికారి జోనల్ కమిషనర్ ఉన్న చోట ఇలాంటి దారుణం జరగడం విమర్శలకు తావిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

