AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: అరుదైన యోగం.. ఈ నాలుగు రాశుల వారు మహా అదృష్టవంతులు!

Hamsa Maha Purusha Yoga: అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు గురు గ్రహం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండటంతో, మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు హంస మహా పురుష యోగం కలుగుతుంది. ఈ మహాయోగం అదృష్టం, ధనలాభాలను కలిగిస్తుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థానం, కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. రాజయోగాలు, ధన యోగాలతో జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి.

Lucky Zodiacs: అరుదైన యోగం.. ఈ నాలుగు రాశుల వారు మహా అదృష్టవంతులు!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 16, 2025 | 4:10 PM

Share

Lucky Zodiac Signs: జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు గ్రహం బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకులకు సిరిసంపదలకు, అదృష్టాలకు, శుభ యోగాలకు కొదవ ఉండదు. ధన కారకుడు, గృహ కారకుడు, పుత్ర కారకుడు, అదృష్ట కారకుడు అయిన గురు గ్రహం ఈ నెల(అక్టోబర్) 19 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి హంస మహా పురుష యోగమనే అదృష్ట యోగం కలుగుతుంది. ఈ మహాయోగం పట్టినవారు ఒక ప్రముఖుడి స్థాయికి ఎదుగుతారు. వీరి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఈ రాశివారికి పండగ కూడా అద్భుతంగా సాగిపోతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల హంస మహా పురుష యోగం కలిగింది. ఈ యోగం పట్టినప్పుడు సగటు వ్యక్తి సైతం ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బ డిగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగం కలుగుతుంది. రాజపూజ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో అత్యున్నత పదవులు పొందుతారు. జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  3. తుల: ఈ రాశికి దశమ కేంద్రంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం కలిగింది. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ది చెందుతుంది.
  4. మకరం:ఈ రాశికి సప్తమ కేంద్రంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల హంస మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆర్థిక, అనారోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధన యోగాలు పడతాయి.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..