Horoscope Today: ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఆదాయం పెరిగే ఛాన్స్!
Daily Horoscope (April 21, 2026): మంగళవారం రోజున 12 రాశుల వారికి సాధారణంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయ అవకాశాలు మెరుగ్గా ఉండగా, కొన్ని రాశుల వారికి అదనపు బాధ్యతలు, శ్రమ కూడా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఎక్కువగా సాఫీగా సాగుతుండగా, కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

దిన ఫలాలు (ఏప్రిల్ 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి. సోదరులతో రాజీమార్గం ద్వారా ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల విష యంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొం టారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది. ధార్మిక వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఊహించని రాజపూజ్యాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశముంది. కొత్త ఉద్యోగం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభా లకు లోటుండదు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయవృద్ధికి అవకాశముంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తల్ని పాటించడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, సరైన విధంగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ మరింతగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా పుంజు కుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభి స్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పొందుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగు తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం మీద మరింత శ్రద్ద పెట్టడం అవసరం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు, కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెట్టే అవకాశముంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపా రాలు ఉత్సాహంగా సాగుతాయి. రుణ సమస్యల నుంచి కొంత ఊరట లభిస్తుంది. జీవిత భాగస్వా మితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవు తాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీ కరిస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.