AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT : ఓటీటీలో ఇదే నంబర్ వన్ ట్రెండింగ్ సినిమా.. నిజమైన సంఘటన ఆధారంగా తీసిన మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్నో వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక సరికొత్త వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో, ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రియులు తప్పక చూడవలసిన (Must Watch) కంటెంట్‌గా దీనికి ప్రశంసలు దక్కుతున్నాయి. అదెంటో తెలుసుకుందామా.

Cinema OTT : ఓటీటీలో ఇదే నంబర్ వన్ ట్రెండింగ్ సినిమా.. నిజమైన సంఘటన ఆధారంగా తీసిన మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి..
Inspector Avinash
Rajitha Chanti
|

Updated on: May 25, 2026 | 8:04 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో విడుదలైన ఒక వెబ్ సిరీస్ సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన ఈ సిరీస్ అభిమానుల నుండి విశేష ఆదరణ పొందుతోంది. ‘ఇన్‌స్పెక్టర్ అవినాస్’ అనేది నీరజ్ పాఠక్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఒక వెబ్ సిరీస్. ఇందులో రణదీప్ హూడా ప్రధాన పాత్ర పోషించారు. ఊర్వశి రౌతేలా, నటించిన ఈ సిరీస్ జియో సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఈ సిరీస్ 2వ సీజన్ రిలీజ్ కగా.. జియో హాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ సిరీస్ ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

ఈ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లో పనిచేసిన ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ మిశ్రా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఆయన తన కెరీర్‌లో 150 ఎన్‌కౌంటర్లు చేశారు. ఆ నిజ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించగా.. బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా ఇన్‌స్పెక్టర్ అవినాష్ పాత్రను పోషిస్తున్నారు. అమిత్ సియాల్, అభిమన్యు సింగ్, జాకిర్ హుస్సేన్, రజనీష్ దుగల్ కీలకపాత్రలు పోషించారు. మొత్తం 10 ఎపిసోడ్లు. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ జానర్‌లో రూపొందించిన ఈ సిరీస్, జియో హాట్‌స్టార్ ఓటీటీలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

రొటీన్ ఫార్ములా కథలకు భిన్నంగా, సస్పెన్స్, థ్రిల్లర్ లేదా ఎమోషనల్ డ్రామా ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ ముగింపులో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులలో తదుపరి ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతను ఆకట్టుకునేలా సమకాలీన అంశాలు, భావోద్వేగాలను ఇందులో చూపించారు. నేపథ్య సంగీతం (BGM) , సినిమాటోగ్రఫీ ఈ సిరీస్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లను మరింతగా ఎలివేట్ చేసింది. వీకెండ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూసే వారికి ఈ సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..