AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వం ఇదే!

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆరవ నెల అయిన జూన్ అనేక విశేషాలను కలిగి ఉంటుంది. ఈ మాసంలో ఏరువాక పౌర్ణమి కూడా రానుంది. అయితే పుట్టిన నక్షత్రం, గ్రహాలు, రాశుల ఆధారంగా జాతక ఫలితాలు అంచనా వేయబడతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ లో జన్మించిన వ్యక్తుల రాశిచక్రం సాధారణంగా మిథునం లేదా కర్కాటకం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. కాగా ఇప్పుడు మనం సంఖ్యా శాస్త్రం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. గుణ గణాలు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 24, 2026 | 5:36 PM

Share
జూన్ నెలలో జన్మించిన వారిలో ఉండే ఒకే ఒక ప్రధాన లక్షణం వారి మూడ్ తరచుగా మారడం. వీరి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వీరు నవ్వుతూ జోకులు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ స్వభావం వారిని కొంత ఊహించని విధంగా చేస్తుంది. అయినప్పటికీ, వీరు స్వభావ రీత్యా చాలా వినయంగా ఉంటారు. వారి ఈ స్వభావం కారణంగా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరికైనా సహాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు.

1 / 5
అలాగే జూన్‌లో జన్మించిన వారు చాలా మంచి మనసు కలిగిన వారు, స్నేహశీలులు. వీరు ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు. అంతే కాకుండా చాలా సులభంగా ప్రేమలో పడిపోతారు. కానీ వీరు తమలోని ప్రేమను మాత్రం అంత తొందరగా తెలియజేయరు. అలాగే జూన్ నెలలో జన్మించిన వారు చాలా ప్రత్యేకమైన వారు, వీరు ఎప్పుడూ కూడా ఇతరులను మోసం చేయరు. ఇతరులచే మోసపోరు కూడా.

2 / 5
ఇక జూన్ నెలలో జన్మించిన వారు కళా రంగంలో రాణిస్తారు. వీరికి  కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పాటలు, క్రీడలు, నృత్యం వంటి రంగాలలో వీరు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. వీరి మాటతీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, దీని ద్వారా వీరు అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. జూన్ నెలలో పుట్టినవారు చాలా తెలివైనవారు. వీరు ఏ పని చేయాలని అనుకున్నా, దానిని పూర్తిచేసే పట్టుదలను కలిగి ఉంటారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. అలాగే అందరిలో చాలా స్పెషల్‌గా కనిపిస్తారు.

3 / 5
ఇక వీరు ఏదైనా సరే చాలా తేలికగా తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరు అయినా ఏదైనా చెబితే, దానిని పూర్తిగా నమ్మిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. వీరు ఎక్కువగా ప్రకృతిలో గడపడానికి ఇష్టపడతారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే వీరి  అదృష్ట సంఖ్యలు 9 , 6.. వీరికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు, మెజెంటా. అదృష్ట రత్నాలు రూబీ, ముత్యం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
జూన్‌లో పుట్టిన వాళ్ళు తెలివైనవాళ్లా? కోపిష్ఠులా? వారి వ్యక్తిత్వ

షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేస్తే, పట్టులాంటి జుట్టు

పరమ పీనాసోడు.. శోభన్ బాబు గురించి ఆ స్టార్ నటి అలా అనేసిందేంటి?

ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
ఉష్ణోగ్రతలు పెరిగితే ఏసీ పేలిపోతుందా?
రివ్యూ తీసుకున్నాక కూడా అంపైర్స్ కాల్ ఎందుకు ఇస్తారు..?

డబ్బు, ఆరోగ్యం, పెళ్లి సమస్యలా? మూడు సోమవారాలు ఈ శివ పరిహారం..

నటి సౌందర్య అసలు పేరు ఏంటో మీకు తెలుసా..?

యార్కర్ కింగ్ కెరీర్‌లోనే చెత్త సీజన్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి

కుక్కలు చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో తెలుసా..?

జాబ్ కోసం వెతుకుతుంటే జాగ్రత్త.. యువతను టార్గెట్ చేస్తున్న ఆన్‌..