Andhra News: ఉండవల్లి కొండపై అగ్ని ప్రమాదం.. ప్రభుత్వం కీలక ప్రకటన
గుంటూరు జిల్లా ఉండవల్లి కొండపై జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు కలెక్టర్ సీఎంకు తెలిపారు. మంటలు పూర్తిగా ఆరిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో ఉండవల్లి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కొండపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈదురుగాలుల కారణంగా మంటు వేగంగా విస్తరించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మంటలే ఈ మంట పెట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని సీఎంకు అధికారులు తెలిపారు. సాయంత్రం అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారని తెలిపారు. మంటలను కాలనీలు, జనవాసాల వైపు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది ఆపినట్టు తెలిపారు.
ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని సిబ్బంది అంతా అలెర్టుగా ఉన్నారని సిఎంకు గుంటూరు జిల్లా కలెక్టర్ విరరించారు. ఉండవల్లి సమీపంలోని కుమ్మరిగుంట చెరువు వద్ద రెండు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచామని.. ఫైర్ సేఫ్టీ వాహనాలు చేరుకోగలిగిన ప్రాంతం వరకు వెళ్లి పైపుల సహాయంతో మంటలు అదుపు చేసినట్టు తెలిపారు. ఇళ్లకు సమీపంలో మంటలు లేవని అగ్నిమాపక సిబ్బంది అలెర్టుగా ఉన్నారని విరించారు.
అయితే మంటలు పూర్తిగా ఆరిపోయేవరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించాలని తెలిపారు.స్థానిక ప్రజలు ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
