Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 27th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2024 | 6:01 AM

దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అత్యవసర పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి. వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. పిల్లలు తమ చదువుల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల నుంచి శుభవార్త వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభా లకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాధానం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం పెరిగి కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయ ప్రయ త్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, అందులో ఎక్కువ భాగం వృథా ఖర్చులకు సరిపోతుంది. నిరుద్యోగులు ఆశించిన ఆఫర్లు అందుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, చికాకులుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి మార్పులు చేసి ప్రయో జనం పొందుతారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశిం చిన స్పందన లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని ఆర్థిక సంబంధమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా విమర్శలు, ఒత్తిడి తప్పకపోవచ్చు. అలవి కాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండకపోవచ్చు. రావలసిన డబ్బును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువర్గంలోనే మంచి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులతో దూరం పాటించడం మంచిది. కొద్ది ప్రయత్నంతో చిన్నా చితకా వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ప్రయా ణాల్లో బాగా ఇబ్బందులు పడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, సంతోషంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఆస్తి వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండే అవ కాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులకు కోత పెడతారు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉండి, నిద్రాహారాలు దూరం అవుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు చేపడతారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు. కుటుంబ సభ్యులతో నచ్చిన ప్రాంతాల్ని సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అను కూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయానికి లోటుండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!