Money Astrology: కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
మరో నెలన్నర పాటు నాలుగు చరరాశులతో సహా ఆరు రాశులకు ముఖ్యమైన గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉండబోతోంది. దీనివల్ల అనేక శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. మేషం, కర్కాటకం, తుల, మకర రాశులతో పాటు, కన్య, మీన రాశుల వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
మరో నెలన్నర పాటు నాలుగు చరరాశులతో సహా ఆరు రాశులకు ముఖ్యమైన గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉండబోతోంది. దీనివల్ల అనేక శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. మేషం, కర్కాటకం, తుల, మకర రాశులతో పాటు, కన్య, మీన రాశుల వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
- మేషం: ఈ రాశికి శని, కుజ, రవి, గురువు, శుక్ర, బుధులు, అంటే ఏకంగా ఆరు గ్రహాలు బాగా అను కూలంగా ఉండడం విశేషం. ఎన్నడూ అనుభవించని సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఈ రాశివారికి లభించే అవకాశం ఉంది. ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడమే తగ్గడం ఉండదు. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. అనారోగ్యాలకు పెద్దగా అవకాశం ఉండదు.
- కర్కాటకం: ఈ రాశివారికి గురువు, కుజుడు, శుక్రుడు, రవి, బుధులు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉండడం వల్ల అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు చిన్నపాటి ప్రయత్నంతో కలలు సాకారం అవుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశాలు మెరుగుపడతాయి.
- కన్య: ఈ రాశివారికి శని, గురువు, కుజుడు, శుక్రుడు, రవి గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేస్తు న్నందువల్ల తప్పకుండా జీవితం మారిపోతుంది. ఆదాయం, అధికారం వంటి విషయాల్లో ఊహిం చని మలుపులు తిరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలపడి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఆరో గ్యం దృఢంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి.
- తుల: ఈ రాశికి శని, రాహువు, శుక్రుడు, రవి, బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రాజయో గాలు, ధన యోగాలు తప్పకుండా పడతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- మకరం: ఈ రాశికి శని, రాహువు, గురు, కుజులు, రవి, శుక్రులు అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కడికి వెళ్లినా గౌరవమర్యాదలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో విలువైన ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నిటికీ సానుకూల స్పందన లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు.
- మీనం: ఈ రాశికి గురువు, కుజుడు, రవి, శుక్రులు, శని బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లోనే కాకుండా ఆదాయపరంగా కూడా అనేక అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఆశించిన స్థాయిలో ఆదా యం పెరుగుతుంది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది.