Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వార ఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శని, గురు, కుజ గ్రహాల అనుకూలత వల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలు బాగా ఉప యోగపడతాయి. వ్యాపార వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబపరంగా శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాహువు, గురు, కుజులు, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా శుభ ప్రదంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. కుటుంబపరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఒత్తిడి, శ్రమ నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో ఇతరుల బాధ్యతలను మోయాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా పరవాలేదనిపి స్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తరచూ దుర్గాష్టకం చదువుకోవడం చాలా అవసరం.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ధన స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల ఆదాయానికి లోటు లేనప్పటికీ, వ్యయ స్థానంలో కుజ, గురువుల కారణంగా అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. రాశ్యధిపతి బుధుడు సింహ రాశిలో ఉన్నందువల్ల మొత్తం మీద వారమంతా హుందాగా, గౌరవంగా గడిచిపోతుంది. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. దూరపు బంధువుల ద్వారా పెళ్లి సంబం ధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు దూసుకు పోతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యా ర్థుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గణపతి స్తోత్రం వల్ల శీఘ్ర పురోగతి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో గురు, కుజ గ్రహాలు కలిసి ఉండడం, ధన స్థానంలో బుధుడు ఉండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మొత్తం మీద దేనికీ లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాలభైరవాష్టకం చదువుకోవడం ఉత్తమం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ స్థానంలో గురు, కుజులు, ఈ రాశిలో బుధుడు ఉండడం వల్ల ఉద్యోగంలో సమస్యలన్నీ పరి ష్కారమై, సానుకూలతలు పెరుగుతాయి. రాశ్యధిపతి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బదిలీలు, స్థాన చలనాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగి స్తుంది. ఇంటా బయటా బాధ్యతలు, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు అదు పులో ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
భాగ్య స్థానం, ఆరవ స్థానం, లాభ స్థానం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ రాశ్యధిపతి బుధుడు వ్యయంలో ఉన్నందువల్ల ఎంత ఆదాయం పెరిగినా ఖర్చుల భారం ఎక్కువగా ఉంటుంది. మన సులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆపర్లు అందుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత సానుకూల దృక్ప థంతో వ్యవహరిస్తే అంత మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో రాబడి వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాహువు, శుక్ర, రవి, బుధుల అనుకూలత అనేక కష్టనష్టాల నుంచి బయటపడేస్తుంది. వారం రోజుల పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయాలు సాధి స్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవ హారాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. రావలసిన డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశిం చిన లాభాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అర్ధాష్టమ శని ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ, రాశ్యధిపతి కుజుడితో గురువు కలిసి ఉన్నందువల్ల ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొం టాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఇంట్లోఝ శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఉప శమనం లభిస్తుంది. అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగు తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల తప్పకుండా విజయాలు సిద్ధిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటాయి. ఈ అనుకూల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తప్పకుండా పరిష్కారం అయి, ఊరట కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగు పడుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, రాహు, గురు, కుజ, శుక్రుల అనుకూలత వల్ల వారమంతా సానుకూలంగా, లాభదాయకంగా గడిచిపోతుంది. ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారా లను సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. అనారోగ్యాలు అదుపులో ఉంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు సకాలంలో ముగుస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విద్యార్థులు సునా యాసంగా పురోగతి సాధిస్తారు. శివార్చన వల్ల కొన్ని కష్టనష్టాల నుంచి తేలికగా గట్టెక్కుతారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. కొద్ది శ్రమతో పనులన్నీ పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే, కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యక్తిగత, కుటుంబ విషయాలు కొద్దిగా ఒత్తిడి కలిగిస్తాయి. ఆర్థిక సమస్యల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. తరచూ శివార్చన చేయడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ, వ్యయ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కాస్తంత తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఇష్టమైన బంధు మిత్రులను శుభకార్యంలో కలుసుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవు తుంది. విద్యార్థులకు బాగుంటుంది. రోజూ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.