Astrology: అనుకూలంగా చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!

ఈ నెల 28 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ఈ మూడు రాశులు చంద్రుడికి బాగా అనుకూల రాశులు అయినందువల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

Astrology: అనుకూలంగా చంద్రుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి..!
Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 26, 2024 | 5:36 PM

ఈ నెల 28 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ఈ మూడు రాశులు చంద్రుడికి బాగా అనుకూల రాశులు అయినందువల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి చంద్ర సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతోంది.

  1. మేషం: చంద్ర సంచారం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. వీరి అనారోగ్యానికి సరైన వైద్య చికిత్స లభిస్తుంది. అనుకోకుండా ఆదాయం పెరిగి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, ఇష్టమైన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనసులోని కోరికల్లో ఒకటి రెండు తప్పకుండా నెరవేరుతాయి. ఖర్చులు బాగా తగ్గి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
  2. వృషభం: మేష, వృషభ, మిథున రాశుల్లో సంచారంచేసే చంద్రుడు ఈ రాశివారిని మానసిక సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి గట్టెక్కించడం జరుగుతుంది. ఆశించిన మానసిక ప్రశాంతత లభి స్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి స్నేహాలు ఏర్పడ తాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నా లన్నీ విజయవంతం అవుతాయి. విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది.
  3. మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు అనుకూల స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశముంది. అప్రయత్న ధన లాభముంటుంది. రావలసిన డబ్బు తేలికగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు అత్యధిక లాభాలని స్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని స్థాయిలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  4. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సమా జంలోని పెద్దలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. విలాస జీవితంలో మునిగి తేలుతారు. అనా రోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగి పోతుంది. ఎటువంటి సమస్యలైనా తేలికగా పరిష్కారం అవుతాయి. రకరకాల శుభ వార్తలు వింటారు.
  5. సింహం: ఈ రాశికి చంద్రుడు భాగ్య, దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ మూడు స్థానాలు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. కన్య: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు అత్యంత శుభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. ప్రతి ఆదాయ ప్రయత్నమూ పూర్తి స్థాయిలో సత్ఫలితా లనిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పదోన్నతి లభించే అవ కాశం కూడా ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు.

కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్ష‌న్‌లో రాజ్!
కావ్యే టార్గెట్‌గా రుద్రాణి ప్లాన్.. టెన్ష‌న్‌లో రాజ్!
పెయిడ్ డాగ్స్ మొరుగుతాయి అంటూ మండిపడ్డ హర్భజన్!
పెయిడ్ డాగ్స్ మొరుగుతాయి అంటూ మండిపడ్డ హర్భజన్!
ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్‏‎లు తాకిడి..
ఈ వారం ఓటీటీలో చిన్న సినిమాల సందడి.. వెబ్ సిరీస్‏‎లు తాకిడి..
50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ అసలు ముట్టుకోడు
50 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో పోటీ.. చపాతీ అసలు ముట్టుకోడు
గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
2025 పెళ్లికి సిద్ధమవుతున్న ముగ్గురు హీరోయిన్లు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
అమెరికాలో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
బడికి సెలవిస్తారనీ ఓ విద్యార్ధి ఆకతాయిపనికి.. ఢిల్లీ సర్కార్ గజగజ
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రాను తప్పించండి.. ధోని దోస్త్ డిమాండ్
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?
టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్.. మరి స్టార్ స్టేటస్ అందుకుంటారా?