Astrology: సింహ రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పట్టబోతోంది..!

సెప్టెంబర్ 6వ తేదీన సింహరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. సింహ రాశి బుధుడికి ఎంతో ఇష్టమైన రాశి. ఈ రాశిలో బుధుడు సెప్టెంబర్ 23 వరకూ కొనసాగుతాడు. ఏ జాతక చక్రంలో అయినా బుధుడు బలంగా ఉండే పక్షంలో ఎటువంటి సమస్యనైనా స్వయంగా పరిష్కరించుకో గల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. బుధుడు సింహ రాశిలో ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థలా సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది.

Astrology: సింహ రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పట్టబోతోంది..!
Lakshmi Kataksham
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 31, 2024 | 3:25 PM

సెప్టెంబర్ 6వ తేదీన సింహరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. సింహ రాశి బుధుడికి ఎంతో ఇష్టమైన రాశి. ఈ రాశిలో బుధుడు సెప్టెంబర్ 23 వరకూ కొనసాగుతాడు. ఏ జాతక చక్రంలో అయినా బుధుడు బలంగా ఉండే పక్షంలో ఎటువంటి సమస్యనైనా స్వయంగా పరిష్కరించుకో గల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. బుధుడు సింహ రాశిలో ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థలా సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అంతేకాక, తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగు తుంది. బుధుడి సింహ రాశి ప్రవేశం వల్ల మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనూ రాశివారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  1. మేషం: ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు లభిస్తాయి. మనసు చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. న్యాయ పరమైన కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లేదా వేతన పెరుగు దలకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థాన సంచారం వల్ల మనసులోని కొన్ని ముఖ్య మైన కోరికలు నెరవేరే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. ఆదాయం ఆశించి నంతగా పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషా లకు లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. సింహం: ఈ రాశి మీద నుంచి ధన, లాభాధిపతిగా బుధుడి సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ప్రతి ఆదాయ ప్రయత్నమూ సత్ఫలితాలనిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి.
  4. కన్య: ఈ రాశ్యధిపతి బుధుడు సింహ రాశిలో సంచారం చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు బాగా వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలకు అవకాశం ఉంటుంది. జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, ఆశయాలు నెర వేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు.
  5. తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో ప్రవేశించినందువల్ల విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు, సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం నిశ్చ యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి బుధుడి ప్రవేశంతో భాగ్య స్థానం పటిష్ఠం కావడంతో అనేక శుభ యోగాలు కలిగే అవ కాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రెండు మూడుసార్లు ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమ స్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అదృష్టం పడుతుంది.