కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఏలిన్నాటి ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, స్వల్ప అనారోగ్యాలు, డబ్బు నష్టం వంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ, గురు, బుధుల అనుకూలత వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, ఉత్సా హంగా సాగిపోతాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభా లందుకుంటారు. ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. స్కంద స్తోత్రం వల్ల ధన స్థానం పటిష్టమవుతుంది.