- Telugu News Photo Gallery This is the meaning of seeing a scorpion in a dream, check here is details in Telugu
Scorpion in Dream: తేలు కలలో కనిపించిందా.. దానికి అర్థం ఇదే!
సాధారణంగా నిద్రించే సమయంలో అనేక కలలు వస్తాయి. కొంత మందికి పగలు కూడా కలలు వస్తాయి. ఇంకెంత మందికి రాత్రి పూట ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలలు రావడం అనేది సహజం. అయితే ఆ కలలకు.. మన జీవితానికి ముడి పడి ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మీకు కలలో కనిపించే విషయాల గురించి అనేక అర్థాలను తెలుపుతుంది. మీరు ఎక్కువగా వేటి గురించి, ఎవరికి గురించి ఆలోచిస్తూ ఉంటారో..
Updated on: Sep 01, 2024 | 1:28 PM

సాధారణంగా నిద్రించే సమయంలో అనేక కలలు వస్తాయి. కొంత మందికి పగలు కూడా కలలు వస్తాయి. ఇంకెంత మందికి రాత్రి పూట ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలలు రావడం అనేది సహజం. అయితే ఆ కలలకు.. మన జీవితానికి ముడి పడి ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది.

స్వప్న శాస్త్రం ప్రకారం.. మీకు కలలో కనిపించే విషయాల గురించి అనేక అర్థాలను తెలుపుతుంది. మీరు ఎక్కువగా వేటి గురించి, ఎవరికి గురించి ఆలోచిస్తూ ఉంటారో.. వాటి గురించే మీకు నిద్రలో సంకేతాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే కలలో తేలు కనిపిస్తూ ఉంటుంది.

తేలు చాలా విషపూరితమైన ప్రాణి. తేలు కుడితే ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే. తేలు కుడితే వచ్చి నొప్పి అంతా ఇంతా కాదు. మాటల్లో అస్సలు వర్ణించలేం. ఈ విషయం పక్కన పెడితే.. కలలో తేలు కనిపించినా.. కుట్టినా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం.. తేలు కలలో కనిపించడం వల్ల మనకు సమస్యలు ఎదురవుతాయని అర్థం చేసుకోవచ్చు. కానీ వాటి నుంచి మీరు తప్పించుకుని విజయం సాధిస్తారని దీని అర్థం.

అదే మీకు తేలు కుట్టినట్టు.. మీరు ఏడుస్తూ బాధ పడుతున్నట్లు కల వస్తే మాత్రం మీకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయని గుర్తు పెట్టుకోవాలి. మీకు భవిష్యత్తులో కష్టాలు ఎదురవుతాయని, మీకు బతుకు భారంగా ఉంటుందని, ఆర్థిక నష్టాలు ఎదుర్కొనాలని అర్థం. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




