- Telugu News Photo Gallery Technology photos Telangana police introduced Safe app, know here how to use this app
T-SAFE App: ప్రతీ మహిళ ఫోన్‌లో ఈ యాప్ ఉండాల్సిందే.. ఎలా ఉపయోగపడుతుంది
దేశంలో మహిళలపై జరుగుతోన్న దారుణాలు చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. నిత్యం ఏదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మహిళల భద్రత కోసం ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ సేఫ్ యాప్ ఒకటి. ఇంతకీ ఏంటీ యాప్.? అసలు ఇది మహిళలకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 01, 2024 | 1:05 PM

తెలంగాణ పోలీసులు తీసుకొచ్చిన టీ సేఫ్ యాప్ ప్రతీ మహిళ స్మార్ట్ ఫోన్‌లో ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ప్రయాణం చేసే సమయంలో ఎఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా టీ సేఫ్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ సహాయంతో మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించే వీలుగా డిజైన్ చేశారు. ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట గూగూల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం కొన్ని ప్రాథమిక వివరాలు అందించి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కాగానే డయల్ 100 అనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం అక్కడే ఉండే మానిటరింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

వెంటనే మీరు ఎక్కడికి వెళ్తున్నారా.? ఏ వాహనంలో వెళ్తున్నారో ఆ వాహనం నెంబర్‌ను ఎంటర్ చేయాలి. దీంతో మానిటరింగ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఏదైనా ఆపద అనిపిస్తే డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు అలర్ట్ అయి మీరున్న లోకేషన్ ఆధారంగా సంబంధిత స్టేషన్‌కు వెంటనే వివరాలు వెళ్తాయి.

వెంటనే పోలీసులు స్పందించి మీ ఫోన్‌కు కాల్ చేస్తారు. ఒకవేళ మీరు స్పందించకపోతే వెంటనే మీ లోకేషన్‌కు చేరుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా 790 పెట్రోలింగ్ కార్లు, 1085 బ్లూకోల్ట్ వెహికల్స్‌ను సిద్ధం చేశారు.




