- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on boAt Airdopes 141 ANC TWS check here for full details
BoAt Airdopes: రూ. 6 వేల ఇయర్ బడ్స్ రూ. 1500కే.. బోట్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్
ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అమెజాన్‌లో బోట్ ఎయిర్ పాడ్స్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందిస్తోంది. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది. వీటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 01, 2024 | 12:27 PM

బోట్ ఎయిర్‌పాడ్స్ 141 ఏఎన్‌సీ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 5,990కాగా ప్రస్తుతం అమెజాన్‌లో వీటిపై ఏకంగా 73 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఇయర్ బడ్స్‌ను రూ. 1599కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు అమెజాన్ పే బ్యాలెన్స్‌తో పాటు, పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 50 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఇయర్ బడ్స్‌ను రూ. 1550కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ల విషయానికొస్తే బోట్ ఎయిర్‌పాడ్స్‌లో 32 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సేలేషన్ ఫీచర్‌ను అందించారు. దీంతో క్వాలిటీతో కూడిన ఆడియో కాల్స్ అనుభూతిని పొందొచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 42 గంటలపాటు పనిచేస్తుంది.

వాయిస్ కాల్స్ నాణ్యతను మరింత పెంచేందుకు ఇందులో ఈఎన్‌ఎక్స్ టెక్నాలజీని అందించారు. ఇక వీటిని 10 నిమిషాలు రీఛార్జ్ చేస్తే ఏకంగా 150 నిమిషాల పాటు పనిచేస్తుంది.

ఇందులో ఇచ్చిన డ్యూయల్ ఈక్యూ మోడ్స్ ద్వారా నాణ్యమైన సౌండ్ అనుభూతిని పొందొచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5.1 బ్లూటూత్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్‌బీ టైప్‌సీ పోర్టుకు సపోర్ట్ చేస్తుంది.




