Andhra Pradesh: ఒకే ఒక్క మాట మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య అగ్గి రాజేసింది.. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసా?

ఒకరు మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే, ఇద్దరికీ ఒకటే నియోజకవర్గం, పైగా ప్రత్యర్ధులు. కానీ ఓ కామన్‌ ప్రోగ్రామ్‌కి హాజరయ్యారు. అయితే, ఒకే ఒక్క మాట ఇద్దరి..

Andhra Pradesh: ఒకే ఒక్క మాట మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య అగ్గి రాజేసింది.. ఇంతకీ ఆ మాట ఏంటో తెలుసా?
Tdp Vs Ycp
Follow us

|

Updated on: Nov 23, 2022 | 6:07 AM

ఒకరు మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే, ఇద్దరికీ ఒకటే నియోజకవర్గం, పైగా ప్రత్యర్ధులు. కానీ ఓ కామన్‌ ప్రోగ్రామ్‌కి హాజరయ్యారు. అయితే, ఒకే ఒక్క మాట ఇద్దరి మధ్య మంటలు పుట్టించింది. ఇంతకీ, వాళ్లెవరు? అసలేం జరిగింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు, టీడీపీ లీడర్‌ ఆరిమిల్లి రాధాకృష్ణ మధ్య మాటల యుద్ధం హీట్‌ పుట్టించింది. వంగవీటి మోహన్‌రంగా విగ్రహావిష్కరణ సభలో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. స్టేజ్‌పైనే మంత్రి కారుమూరి, టీడీపీ లీడర్‌ ఆరిమిల్లి వాగ్వాదానికి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన ఈ ఇన్సిడెంట్‌ స్థానికంగా రాజకీయ రచ్చ రాజేసింది.

తణుకు పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర పెట్టిన వంగవీటి విగ్రహాన్ని టీడీపీ హయాంలో తొలగించారని కారుమూరి అనడంతో వివాదం చెలరేగింది. మంత్రి కారుమూరి కామెంట్స్‌పై టీడీపీ లీడర్‌ ఆరిమిల్లి అభ్యంతరం చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. గతంలో తానిచ్చిన హామీ మేరకు అన్ని అనుమతులతో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు మంత్రి కారుమూరి.

తణుకు నియోజకవర్గంలో మరిన్ని వంగవీటి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కారుమూరి. పార్టీలు, కులాలతో సంబంధం లేకుండా ప్రజలకు మంచి చేసినవాళ్ల విగ్రహాలు నెలకొల్పుతామన్నారు మంత్రి. వంగవీటి మోహనరంగా ప్రజలకు మంచి చేశారు కాబట్టే, ఆయన మరణించి 30ఏళ్లు అయినా, ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు కారుమూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..