CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ

జగన్‌ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి 12.55 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ఉపన్యసిస్తారు. అర్హులకు పత్రాలు పంపిణీ చేస్తారు.

CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ
Cm Jagan
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:43 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (నవంబర్‌23) శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు. జగన్‌ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి 12.55 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ఉపన్యసిస్తారు. అర్హులకు పత్రాలు పంపిణీ చేస్తారు. మళ్లీ మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడ బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ చేయనున్నారు. దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది.

అత్యాధునిక సాంకేతికతతో..

డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం, 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ ఖచ్చితత్వంతో జియో–రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేయనున్నారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు ( భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో ప్రారంభించబడింది, డిసెంబర్, 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 47,276 చ.కి.మీ పరిధిలోని 6,819 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తయింది. నేటికి 2000 గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తయ్యాయి. అలాగే 1835 గ్రామాల్లో 7,29,381 మంది రైతులకు భూ హక్కు పత్రాలు రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles