AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Project: అడుగంటిన కృష్ణమ్మ..! ఇక తెలుగు ప్రజలకు కడగల్లే.. డెడ్‌ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం.. కారణం ఇదేనట..!

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల సామర్థ్యానికి గాను..ఇప్పుడు 34 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. తాగు, సాగునీటి అవసరాలున్నప్పుడు మాత్రమే జలవిద్యుత్తును ఉత్పత్తి చేయండి. అనవసరంగా విద్యుదుత్పత్తి వద్దు" అంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ ఎంబీ) చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసి... ఇరు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా

Srisailam Project: అడుగంటిన కృష్ణమ్మ..! ఇక తెలుగు ప్రజలకు కడగల్లే.. డెడ్‌ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం.. కారణం ఇదేనట..!
Srisailam Project
J Y Nagi Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Mar 26, 2024 | 7:51 PM

Share

నంద్యాల జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు త్రాగునీరందించే శ్రీశైలం జలాశయం.. ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలుగు రాష్ట్రాలకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, ప్రభుత్వాలు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరం 215 టీఎంసీలకు గాను.. ఇప్పుడు మిగిలింది 34 టీఎంసీలే పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడం జలాశయంలో నిటి నిల్వలు తగ్గిపోయాయి. కేఆర్ఎంబీ విజ్ఞప్తులను రెండు రాష్ట్రాలు పట్టించుకోలేదు. అవసరం లేకున్నా విద్యుదుత్పత్తి చేయడమే శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజికి కారణం అంటున్నారు అధికారులు.

డెడ్ స్టోరేజీకి చేరువలో శ్రీశైలం జలాశయం చేరుకుంది. డ్యామ్ లో నిటినిల్వలు తగ్గిపోయాయి. ఇక ఈ ఎండాకాలం సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇందుకు కారణం ఇరు తెలుగు రాష్టాలు పోటాపోటీగా జలవిద్యుదుత్పత్తి చేయడమే. గత వర్షాకాలంలో సీజన్ లో నిండుకుండలా శ్రీశైలం జలాశయం నిండుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల సామర్థ్యానికి గాను..ఇప్పుడు 34 టీఎంసీల డెడ్ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. తాగు, సాగునీటి అవసరాలున్నప్పుడు మాత్రమే జలవిద్యుత్తును ఉత్పత్తి చేయండి. అనవసరంగా విద్యుదుత్పత్తి వద్దు” అంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ ఎంబీ) చేసిన విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసి… ఇరు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో ఈ దుస్థితి నెలకొంది.

ఈ పరిస్థితులను ముందే ఊహించిన కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ పలుమార్లు లేఖలు రాసింది. చివరికి బతిమాలుతూ జలవిద్యుత్తును నిలిపివేయాలని కోరింది. తాగు, సాగు నీటి అవసరాల కోసం మాత్రమే జల విద్యుత్తు ఉత్పత్తి జరగాలి. కానీ, సాగు, తాగునీటి ఆవసరాలకు లేకుండా శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడంతో విలువైన నీరు దిగువకు వెళ్లిపోయింది. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

శ్రీశైలం జలాశయంలో గత ఏడాది మార్చి 26 ఇదే సమయానికి 809.60 అడుగులుగా 34.4273 టి.ఎం. సి. జలాశయంలో నీరు ఉంది. అయితే, ప్రస్తుతం ఇవాళ శ్రీశైలం జలాశయం నీటిమట్టం 810.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తీ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 810. 70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 34.6979 టీఎంసీలుగా నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..