AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈతరం ఇల్లాలు..! ఇది సీరియల్‌ కాదండోయ్‌.. స్మార్ట్‌ వర్క్‌తో అదరగొడుతున్న నేటి కోడలు..

సోషల్ మీడియాలో మనం తరచూ జుగాఢ్‌ వీడియోలను చూస్తుంటాం.. అలాంటిదే ఈ వీడియో కూడా...జుగాఢ్‌ పనులంటేనే అవి అద్భుతంగా ఉంటాయి. మీరు దేశీ జుగాఢ్‌ వేలకొద్దీ వీడియోలను చూసి ఉంటారు. ఈ క్రమంలో ఈ వీడియో ప్రజలను ఆలోచనలో పడేలా చేసింది. ఈ వీడియోలో ఒక తెలివైన కోడలు

Watch Video: ఈతరం ఇల్లాలు..! ఇది సీరియల్‌ కాదండోయ్‌.. స్మార్ట్‌ వర్క్‌తో అదరగొడుతున్న నేటి కోడలు..
Smart Daughter In Law
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2024 | 6:52 PM

Share

తెలివిగల కోడలు తన స్మార్ట్‌ వర్క్‌తో ఇంట్లో అందరినీ సంతోషపెడుతుంది. కాస్త ఆలోచన, ఇంకాస్తా ఓపికా ఉండాలే గానీ అత్తారింట్లో..అందరితో కలిసిపోవచ్చునని నిరూపిస్తుంది. కానీ, నేటి తరం కోడళ్లకు మాత్రం ఇవేవీ లేవనే చెప్పాలి. ఎందుకంటే.. ఇలా పెళ్లి జరిగిందో లేదో.. అలా వేరు కాపురం పెట్టేస్తున్నారు. అత్తామామలు అసలే వద్దు.. చుట్టాలు, బంధువుల ఊసే వద్దు.. ఇలాంటి తరుణంలో ఒక స్మార్ట్‌ కోడలు చేసిన పని నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరీ ఆ ఇంట్లో ఎంత మంది ఉంటారు.. ఎంత పని ఉంటుందో తెలియదు గానీ,.. ఆ కోడలు చేస్తున్న తెలివైన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్‌ వీడియోలో ఒక గృహిణి అద్భుత ట్రిక్‌ ప్లే చేసి.. చపాతీలు చేస్తోంది. అది చూస్తే మీరు కూడా అంటారు.. ఈతరం ఇల్లాలు అని..!

సోషల్ మీడియాలో మనం తరచూ జుగాఢ్‌ వీడియోలను చూస్తుంటాం.. అలాంటిదే ఈ వీడియో కూడా…జుగాఢ్‌ పనులంటేనే అవి అద్భుతంగా ఉంటాయి. మీరు దేశీ జుగాఢ్‌ వేలకొద్దీ వీడియోలను చూసి ఉంటారు. ఈ క్రమంలో ఈ వీడియో ప్రజలను ఆలోచనలో పడేలా చేసింది. ఈ వీడియోలో ఒక తెలివైన కోడలు ఒకేసారి నాలుగు చపాతీలు తయారు చేయడం కనిపిస్తుంది. స్మార్ట్ కోడలు అనే క్యాప్షన్‌తో వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో స్మార్ట్‌ కోడలు అని పిలుస్తున్న ఈ ఇల్లాలు..చపాతీ తయారీ కోసం అద్భుతమైన టెక్నిక్‌తో మన ముందుకు వచ్చింది. ఒక్కో రోటీకి బదులు ఏకంగా నాలుగు చపాతీలు ఒకేసారి చేస్తూ కనిపించింది. ముందుగా ఆమె చపాతీలకు కావాల్సిన పిండిని సిద్ధం చేసి ఉంచుకుంది. మెత్తగా చేసిన పిండిని పెద్దసైజు బంతిలా చేసుకుంది..దాన్ని చపాతీ కర్రతో వత్తుతూ పెడవైన రోటీ తయారు చేసింది..ఆ తర్వాత ఒక గుండ్రని గిన్నెతో ఆ చపాతీని నాలుగుగా కట్ చేసుకుంది. ఆమె ఈ నాలుగు రోటీలను ఒకేసారి ఒకే పాన్‌పై కాల్చడం కూడా మొదలుపెట్టింది..! వావ్‌ ఆ వీడియో ఎలా ఉందో మీరే చూడండి..

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో rajput_jodi_ అనే ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. దీనితో పాటు, ‘బాగా చేసారు.. ఈ ఆలోచన భారతదేశం దాటి బయటకు వెళ్లకూడదు’ అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వినియోగదారులు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు 40 మిలియన్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..