AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. అందం కోసం పాము రక్తం తాగుతున్న అమ్మాయిలు..! ఎక్కడో తెలుసా..?

నిజానికి జకార్తాలో విషపూరితమైన నాగుపాముల రక్తాన్ని తాగే ప్రత్యేకమైన ట్రెండ్ ఉంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో నాగుపాము రక్తాన్ని తీసి విక్రయిస్తుంటారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు వాటిని రుచి చూసి తాగుతున్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందంతో పాము రక్తాన్ని తాగుతారు. పాము రక్తం తాగడం వల్ల చర్మం మెరుస్తుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం.

బాబోయ్‌.. అందం కోసం పాము రక్తం తాగుతున్న అమ్మాయిలు..! ఎక్కడో తెలుసా..?
Snake Blood
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2024 | 7:11 PM

Share

ఈ విషసర్పం రక్తమే ఇన్ని రోగాలకు మందు.. అందం, ఆరోగ్యం కోసం ఇక్కడి ప్రజలు తాగేది ఇదే!! పాము పేరు వినగానే మనలో చాలా మందికి వణుకు పుడుతుంది. ఎందుకంటే అవి భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. ఎంత బలవంతులకైనా పామును చూడగానే చెమటలు పట్టేస్తాయి. కానీ, విషపూరితమైన నాగుపాము రక్తాన్ని తాగే అమ్మాయిలు కూడా ఉన్నారంటే నమ్మగలరా..? అవును, మీరు చదివింది నిజమే..విషసర్పం రక్తాన్ని టీ, కాఫీ అంత ఇష్టంగా తాగే దేశం కూడా ఉందని తెలిస్తే షాక్‌ అవుతారు. పాము విషసర్పమే అయినప్పటికీ అక్కడి అమ్మాయిలు పాము రక్తాన్ని తాగుతారట. పాము రక్తంతో ఆరోగ్యం, అందం రెండింటికీ మేలు చేస్తాయని వారు నమ్ముతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాము భూమిపై అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన జీవిగా పరిగణించబడుతుంది. ఈ విషసర్పాన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు. అయితే, ఇండోనేషియాన్‌ అమ్మాయిలు మాత్రం అందం, ఆరోగ్యం కోసం ఈ విషసర్పం రక్తాన్ని తాగుతున్నారు. ఇండోనేషియన్లు పాము రక్తం తాగుతారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అందమైన చర్మాన్ని పొందడానికి ఈ దేశ ప్రజలు పాము రక్తాన్ని తాగుతారు. పాము రక్తం తాగడానికి ఆయా దుకాణాల్లో ప్రజల రద్దీ ఎప్పుడూ కొనసాగుతుంది.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో పాము రక్తం తాగడం సర్వసాధారణం. ఇక్కడ ఎక్కడ చూసినా అదేదో కాఫీ, టీ స్టాల్‌ అన్నట్టుగా పాము రక్తాన్ని విక్రయించే దుకాణాలు కనిపిస్తాయి. నిజానికి జకార్తాలో విషపూరితమైన నాగుపాముల రక్తాన్ని తాగే ప్రత్యేకమైన ట్రెండ్ ఉంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో నాగుపాము రక్తాన్ని తీసి విక్రయిస్తుంటారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు వాటిని రుచి చూసి తాగుతున్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందంతో పాము రక్తాన్ని తాగుతారు. జకార్తాలో పాము రక్తానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీని కారణంగా, ప్రతిరోజూ వేలాది పాములు ఇక్కడ చంపబడుతున్నాయి.. పాము రక్తం తాగిన తర్వాత 3-4 గంటల వరకు టీ లేదా కాఫీ తాగకూడదని చెబుతారు. దాంతో పాము రక్తం మనిషి శరీరంలోకి ప్రవేశించి తన పనిని చేస్తుంది. పాము రక్తం తాగేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ దుకాణాలకు జనం పోటెత్తుతుంటారు.

ఇవి కూడా చదవండి

పాము రక్తం తాగడానికి కారణం..

ఈ దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పాము రక్తం తాగుతారు. అంతేకాదు.. ఇక్కడి మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి కూడా పాము రక్తం తాగుతారట. పాము రక్తం తాగడం వల్ల చర్మం మెరుస్తుందని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఇక్కడి ప్రజల విశ్వాసం.

ఇండోనేషియాలో పాము రక్తం తాగే సంప్రదాయం చాలా పురాతనమైనది. ఇక్కడ పాములను తింటారు కూడా. ఇక్కడి ప్రజలు పాములను నిమ్మగడ్డితో ఉడకబెట్టి లేదా వేయించి తింటారు. పాము రక్తాన్ని అన్నం వైన్‌తో కలిపి సేవిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..