AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనసపండుతో పండంటి ఆరోగ్యం..! తప్పక తెలుసుకోవాల్సిన అద్భుత ప్రయోజనాలు..

ఇది దృష్టిని మెరుగుపరచడానికి, కంటి చూపు సమస్యలను నిరోధించడానికి, కంటి సమస్యలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జాక్‌ఫ్రూట్‌లో ఎముకలకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి. జాక్‌ఫ్రూట్‌ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య సమస్యలను నివారించడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పనసపండుతో పండంటి ఆరోగ్యం..! తప్పక తెలుసుకోవాల్సిన అద్భుత ప్రయోజనాలు..
Jackfruit
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2024 | 4:12 PM

Share

మనం ఇష్టంగా తినే పండ్లలో పనస పండు ఒకటి. ఈ పనస పండు సంపూర్ణమైన, బలవర్దకమైన ఆహారం. ఈ తీపి, రుచికరమైన పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్‌ను సమృద్ధిగా కలిగి ఉంది. జాక్‌ఫ్రూట్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జాక్‌ఫ్రూట్ విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉండే పండు. జాక్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జాక్‌ఫ్రూట్ బరువు తగ్గడానికి ఉత్తమమైన పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దారితీస్తుంది.

జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి శరీరాన్ని అనుమతిస్తుంది. జాక్‌ఫ్రూట్‌లో రకరకాల ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరోగ్యాన్ని సమర్ధవతంగా రక్షించడంలో, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఉపయోగపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ ఎ, సి అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది దృష్టిని మెరుగుపరచడానికి, కంటి చూపు సమస్యలను నిరోధించడానికి, కంటి సమస్యలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జాక్‌ఫ్రూట్‌లో ఎముకలకు అవసరమైన మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి. జాక్‌ఫ్రూట్‌ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య సమస్యలను నివారించడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..