Health Tips: బరువు తగ్గించే సూపర్ డ్రింక్..! ఖాళీ కడుపుతో తాగరంటే ఆరోగ్యం- ఐశ్వర్యం..!!

ఈ నీరు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజంతా మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఉపయోగం వల్ల జుట్టు రాలడం సమస్యకు చెక్‌ పెడుతుంది. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బహిష్టు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Health Tips: బరువు తగ్గించే సూపర్ డ్రింక్..! ఖాళీ కడుపుతో తాగరంటే ఆరోగ్యం- ఐశ్వర్యం..!!
Safron Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2024 | 9:11 PM

సాధారణంగా ప్రజలు టీ, కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. మనం తీసుకునే ఆహారం, పానీయాల ప్రభావం మన ఆరోగ్యం, మన చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా పెంచే అటువంటి హెల్తీ డ్రింక్స్‌ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి కుంకుమ పువ్వు నీళ్లు.. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా? మీరు మీ ఉదయాన్నే ఈ డ్రింక్‌తో ప్రారంభించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో కుంకుమపువ్వును ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మం, ఆరోగ్యం రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

కుంకుమపువ్వు నీరు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజంతా మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ఉపయోగం వల్ల జుట్టు రాలడం సమస్యకు చెక్‌ పెడుతుంది. ఇది మీ చర్మానికి మెరుపును తెస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బహిష్టు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

కుంకుమపువ్వు నీటిని ఎలా తయారుచేయాలి?:

ఇవి కూడా చదవండి

కుంకుమపువ్వు నీటిని తయారుచేయడానికి, 1 కప్పు నీటిలో కుంకుమపువ్వు వేసి, దాల్చినచెక్క, యాలకులు వేసి, సుమారు ఐదు నిమిషాలు నీటిని మరిగించాలి. దీని తర్వాత కాసేపు చల్లారిన తర్వాత, అందులో తేనె కలుపుకుని తాగాలి. చాలా వేడిగా ఉన్నప్పుడు తేనెను వేయకూడదు. వేడి నీటిలో తేనె కలపడం వల్ల దాని పోషకాలను నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!