Sleeping on Floor: నేలపై పడుకుంటే వచ్చే లాభాలు తెలిస్తే ఇకపై బెడ్ ఎక్కరు

బెడ్‌పై కాకుండా నేలపై పడుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే నిద్ర సమస్యలున్న వారికి కూడా స్లీపింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు...

Sleeping on Floor: నేలపై పడుకుంటే వచ్చే లాభాలు తెలిస్తే ఇకపై బెడ్ ఎక్కరు
Sleeping On Floor
Follow us

|

Updated on: Mar 26, 2024 | 1:40 PM

మెత్తటి బెడ్‌పై పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బెడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే బెడ్‌పై కంటే నేలపై పడుకుంటేనే ఎక్కువ మేలు అని మీకు తెలుసా.? బెడ్‌తో పోల్చితే నేలపై పడుకుంటేనే ఎక్కువ లాభాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెడ్‌పై కాకుండా నేలపై పడుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే నిద్ర సమస్యలున్న వారికి కూడా స్లీపింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇంతకీ నేలపై పడుకోవడం ఎవరికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* వెన్ను నొప్పితో ఇబ్బంది పడే వారు నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌పై పడుకోవడం వల్ల నిద్ర భంగిమల్లో మార్పులు జరగుతుంటాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్నునొప్పికి చెక్‌ పెట్టొచ్చు. నేలపై పడుకోవడం వల్ల హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్​కు ఉపశమనం లభించి నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* సాధారణంగా ఉదయం సమయాల్లో కొందరు సరైన పొజిషన్‌లో కూర్చొరు. ముఖ్యంగా ఆఫీసుల్లో గంటలతరబడి కూర్చునే వారు సరైన భంగిమలో కూర్చొని కారణంగా మెడ, నడుము నొప్పి లేస్తుంది. ఇలాంటి వారు నేలపై పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. నేలపై నిటారుగా నడుము ఉంచి పడుకుంటే నడుము, మెడనొప్పి తగ్గుతుంది.

* పనిలో ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు కారణం ఏదైనా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి కారణంగా చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేము. అయితే నేలపై పడుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేలపై పడుకోవడం మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించినా ఆ తర్వాత మార్పు గమనిస్తారు.

* రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా నేలపై పడుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కండరాలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల మెదుడుకు ప్రశాంతత లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ