AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సినిమా సీన్‌ కాదు గురూ.. రియల్‌ స్టంట్‌..! పెద్దపులి లాంగ్‌ జంప్‌ చూస్తే గుండె జారి గల్లంతే..

పెద్ద పులికి సంబంధించిన ఒక షాకింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియ‌న్ రైల్వే అకౌంట్స్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ అనంత్ రూప‌న‌గుడి తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇక్కడి పార్క్ లో ప్రధాన ఆకర్షణగా పిలువబడే బెంగాల్ టైగర్ మూడ్‌లో నడుస్తూ కనిపించింది. ఆ తర్వాత, రాయల్ బెంగాల్ టైగర్ అమాంతంగా దూకడం కనిపించింది. అడవిలో..

Watch Video: సినిమా సీన్‌ కాదు గురూ.. రియల్‌ స్టంట్‌..! పెద్దపులి లాంగ్‌ జంప్‌ చూస్తే గుండె జారి గల్లంతే..
Tigers Majestic
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2024 | 4:58 PM

Share

మృగరాజు పవర్ ఏంటో అందరికీ తెలిసిందే.! కానీ, అలాంటి అడవి రాజు అంత ఈజీగా ఎవరి కంట పడడు..ఎందుకంటే రాయల్ బెంగాల్ టైగర్ అడవిలో అంతుచిక్కని జంతువు.. అందుకే పులిని దాని సహజ ఆవాసంలో చూసినప్పుడు కలిగే థ్రిల్ సాటిలేనిది. అడవిలో పులిని చూడటం అనేది ఎవరికైనా ఒక మనోహరమైన, జీవితంలో ఒక్కసారే కలిగే మర్చిపోలేని అనుభవం. కానీ, స్థానికంగా అలాంటి సీన్‌ ఎదురుపడితే.. ప్రమాదం ఇరువైపులా ఉంది. పులులు భ‌యంక‌ర‌మైన మృగాలు. ఇత‌ర జంతువులు, మ‌న‌షులు వాటి కంట పెడితే.. వెంట‌బ‌డి వేటాడుతాయి. అయితే అటవీ శాఖ సౌజన్యంతో కొన్నిసార్లు కొన్ని వీడియోలు విడుదలవుతున్నాయి. అలాంటి వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..

పెద్ద పులికి సంబంధించిన ఒక షాకింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియ‌న్ రైల్వే అకౌంట్స్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ అనంత్ రూప‌న‌గుడి తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో మొదట్లో సుందర్‌బన్స్ నేషనల్ పార్క్ లో ప్రధాన ఆకర్షణగా పిలువబడే బెంగాల్ టైగర్ మూడ్‌లో నడుస్తూ కనిపించింది. ఆ తర్వాత, రాయల్ బెంగాల్ టైగర్ అమాంతంగా దూకడం కనిపించింది. అడవిలో ప్రవహించే చిన్న నదిని దాటేందుకు ఆ పులి లాంగ్‌ జంప్‌ చేసింది. వామ్మో పులి జంప్‌ చూసిన ఇంటర్‌ నెట్ వరల్డ్ ఫిదా అయిపోయింది. ఈ షాకింగ్‌ సీన్‌ వెస్ట్ బెంగాల్‌లోని సుంద‌ర్బ‌న్ నేష‌న‌ల్ పార్కులో కెమెరాకు చిక్కిన‌ట్లు పేర్కొన్నారు. పులి ఆ కాల్వ‌ను దాటేందుకు తాను ఉన్న పొజిష‌న్ నుంచి 20 అడుగుల దూరంలో దూకింద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అసలే పెద్దపులి, ఆపై ఆ పెద్దపులి గాలిలోకి దూకడం చూడటం మరింత అసాధారణమైన అనుభవం. ఈ వీడియో ప‌లువురిని ఆక‌ట్టుకుంది. పులి దూక‌డాన్ని అద్భుత‌మ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ముందుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హర్షల్ మాల్వంకర్ ఇదే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది 6 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. పవర్ ఫుల్ టైగర్ ఫీట్‌పై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..