- Telugu News Photo Gallery Papaya leaves tastes bitter but its juice will make body strong as iron Telugu Lifestyle News
బాబోయ్.. బొప్పాయి ఆకులతో బొలేడు లాభాలున్నాయ్.. ! ఇది మీకు తెలుసా..?
బొప్పాయి తింటే ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. బొప్పాయిలో మన జీర్ణవ్యవస్థను పెంచే అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. పచ్చి, పండిన బొప్పాయిలను ఆహారంలో ఉపయోగిస్తారు. బొప్పాయి మాదిరిగానే బొప్పాయి ఆకుల్లో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల శరీరానికి శక్తినిచ్చి అనేక రోగాలు నశిస్తాయి. బొప్పాయి ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 25, 2024 | 6:32 PM

బొప్పాయి ఆకులు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయని పరిశోధనలు కూడా నిరూపించాయి. బొప్పాయి ఆకులలో శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించే పదార్థాలు ఉంటాయి. బొప్పాయి ఆకుల రసం చేదుగా ఉంటుంది. అందులో కాల్షియం, విటమిన్ ఏ, బీ, సీ, డీ, ఈ ఉంటాయి. ఈ రసం కోసం ఓ ఆకును కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి.. కొద్దిగా నీరు పోసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ చెయ్యాలి. ముఖ్యంగా డెంగ్యూలో బొప్పాయి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు.

బొప్పాయి ఆకుల్లో యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీ డెంగ్యూ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు కూడా బొప్పాయి ఆకు రసం తాగాలని సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి ఆకు సారాన్ని తాగడం వల్ల శరీరాన్ని ఇనుములాగా బలపరుస్తుంది. వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

మలేరియా, డెంగ్యూ వంటి సమస్యలలో బొప్పాయి ఆకులను నీటిలో వేసి మరిగించి దాని సారాన్ని తీసి సేవించాలి. ఈ విధంగా బొప్పాయి సారం తాగడం వల్ల రోగిలో ప్లేట్ లెట్ కౌంట్, ఎర్ర రక్తకణాలు వేగంగా పెరుగుతాయి. అనేక ఆసియా దేశాలలో, బొప్పాయి ఆకులను బెరిబెరి అనే వ్యాధికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

బొప్పాయి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, యాంక్లాయిడ్, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రుగ్మతలు ఔషధం లేకుండా నయమవుతాయి. అయితే, దీనిని తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం కూడా అవసరం.

బొప్పాయి ఆకుల రసం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం చక్కగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది. జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద, చుండ్రు, వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు బొప్పాయి ఆకుల రసంతో పరిష్కరించబడుతుంది. ఇది కండీషనర్‌లా పనిచేసి.. జుట్టు మెరిసేలా చేస్తుంది.




