- Telugu News Photo Gallery Health Problems Of Eating Slate Pencils Details Here Telugu Lifestyle News
కమ్మగా ఉన్నాయని బలపాలు ఇష్టంగా తింటున్నారా..? అయితే ఈ తిప్పలు తప్పవు..! తస్మాత్ జాగ్రత్త..
బలపాలు.. మనందరికీ తెలుసు..? రాయడానికి ఉపయోగించే బలపాలను కొందరు ఇష్టంగా తింటుంటారు..చిన్న పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా డబ్బాల కొద్దీ బలపాలను లాగించేస్తుంటారు. ఇక కొందరు గర్భిణీల్లో బలపాలు తినే అలవాటు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే.. వారికి బలపాల వాసన చూడగానే..నోరూరిపోతుంటుంది. అయితే, బలపాలు తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే, బలపాలు తినడం వల్ల ఏమవుతుందో మరోసారి తెలుసుకుందాం..
Updated on: Mar 25, 2024 | 6:08 PM

Slate Pencils- బలపాలు పెద్ద విష పదార్ధం కాదు. అయినప్పటికీ, బలపాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..బలపాలను సున్నంతో తయారు చేస్తారు.. పైగా అదికూడా ఏ మాత్రం శుద్ధి చేయని సున్నంతో బలపాలను తయారు చేస్తారు. అందు వల్ల బలపాలు తింటే, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Slate Pencils -బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. యూరిన్ సమస్యలు, నోటి అల్సర్, కడుపు అల్సర్, కిడ్నీ స్టోన్స్ సమస్యలతో పాటు ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచివుందని చెబుతున్నారు. అందువల్ల బలపాలు తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

Slate Pencils -అయితే, బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో పీకా అనే సమస్య ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు మట్టి, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుందని చెబుతున్నారు.. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ అంటున్నారు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, గర్భిణీలలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి శరీరంలో జింక్ లోపం కూడా ఈ పీకా సమస్యకు కారణం అవుతుందని చెబుతున్నారు.

Slate Pencils -ఇకపోతే, బలపాలు ఎక్కువగా తినే వారికి త్వరగా వారి దంతాలు పాడవ్వడం జరుగుతుంది. తరచూ జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. మలబద్ధకం, లెడ్ పాయిజనింగ్, కడుపులో నులిపురుగు పెరగడం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అంతేకాదు..బలపాలు ఎక్కువగా తినే వారిలో ఆకలి మందగించడం కూడా చూస్తుంటాం..

Slate Pencils - బలపాలు తినే అలవాటు ఉన్నవాళ్లు ఇప్పటికైనా ఈ అలవాటును మార్చుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడాల్సిన ప్రమాదం ఉందని చెబుతున్నారు. బలపాల రుచి తాత్కాలికంగా మీకు రుచిగా అనిపించినా కానీ, ఆ తర్వాత దాని సైడ్‌ఎఫెక్ట్స్ వల్ల మాత్రం ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంని హెచ్చరిస్తున్నారు.




