అందరూ ఇలా ఉన్నారేంట్రా బాబు..! వంటచేస్తుండగా సిలిండర్ అయిపోతే..? మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు..
ఈ వ్యక్తి నిజంగా చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని ఒకరు రాశారు. ఈ వీడియోను వెంటనే తొలగించండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్ని కాపీ చేయడం ప్రారంభిస్తారని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. నేను 4 సంవత్సరాల క్రితమే ఈ జుగాడ్‌ని ప్రయత్నించాను, గ్యాస్ అయిపోయిన తర్వాత ఈ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది.. దీనిపై పేటెంట్ నాదే సోదరా అంటూ ఇంకొకరు రాశారు. ఇది భారతదేశం దాటి వెళ్లకూడదంటూ చాలా మంది వ్యాఖ్యనించారు.
వంట చేసేటప్పుడు చాలా సార్లు మధ్యలోనే గ్యాస్ అయిపోతుంది. అకస్మాత్తుగా గ్యాస్ అయిపోవడం వంటకు పెద్ద సమస్యగా మారుతుంది. వెంటనే గ్యాస్ నింపడం అంత సులభం కాదు. రెండవ సిలిండర్ లేకపోతే వంట చేయడం ఇక కష్టమే అవుతుంది. అయితే, ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనే వారికి భారతదేశంలో కొరత లేదు. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి వంట చేస్తుండగా, మధ్యలో గ్యాస్ అయిపోవటంతో ఎవరూ ఊహించని జుగాడ్ ప్లాన్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లనుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జుగాడ్ విషయంలో భారతీయులకు సాటి లేదంటున్నారు సోషల్ మీడియా వినియోగదారులు. ఇంతకీ అతడు చేసిన మాస్టర్ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం..
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఏదో వంట చేస్తున్నాడు. అయితే మధ్యలోనే గ్యాస్ అయిపోయిందని వైరల్ వీడియో ద్వారా అర్థమవుతుంది. దాంతో భలే ఆలోచన చేశాడు. వంట గ్యాస్ అయిపోవడంతో అతడు వాటర్ హీటింగ్ రాడ్ ఉపయోగించి వంట చేశాడు. అతడు ఏదో చారు లాంటి కూర చేస్తుండగా మధ్యలో గ్యాస్ అయిపోయింది. దాంతో అతడు కూరగాయలు మరింత ఉడికించేందుకు హీటర్ రాడ్‌ని తీసుకు వచ్చి కూరలో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారగా దీనిపై సరదా కామెంట్లు వస్తున్నాయి.
సోషల్ మీడియా వినియోగదారుల నుండి వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యక్తి నిజంగా చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని ఒకరు రాశారు. ఈ వీడియోను వెంటనే తొలగించండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్ని కాపీ చేయడం ప్రారంభిస్తారని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. నేను 4 సంవత్సరాల క్రితమే ఈ జుగాడ్‌ని ప్రయత్నించాను, గ్యాస్ అయిపోయిన తర్వాత ఈ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది.. దీనిపై పేటెంట్ నాదే సోదరా అంటూ ఇంకొకరు రాశారు. ఇది భారతదేశం దాటి వెళ్లకూడదంటూ చాలా మంది వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..