Watch Video: ఇంత మోసమా..? పాత టైర్‌ని కొత్తగా మార్చి అమ్ముకుంటున్న కంత్రీగాళ్లు..! మీరు జర భద్రం గురూ..

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా.. మనం తినే అన్నంలో ప్లాస్టిక్‌ రైస్‌ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొందరు కంత్రీగాళ్లు..ఈ క్రమంలోనే కాస్త కొత్తగా కనిపించిన మరో మోసం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక్కడ కొంత మంది వ్యక్తులు పాత అరిగిపోయిన టైర్లను ప్యాకింగ్ చేసి తక్కువ సమయంలో కొత్తవిగా మార్చేందుకు సిద్ధం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video: ఇంత మోసమా..? పాత టైర్‌ని కొత్తగా మార్చి అమ్ముకుంటున్న కంత్రీగాళ్లు..! మీరు జర భద్రం గురూ..
Old Tyre New
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 08, 2024 | 3:00 PM

నేటి కాలంలో అడుగడునా బయటపడుతున్న మోసాలు, లూటీలు, చోరీ సంఘటనలతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మోసం జరిగే అవకాశం లేని ఏ ప్రాంతమూ, పదార్థామూ అంటూ ఏదీ లేదు. ఉప్పు పప్పులు మొదలు సబ్బులు, సర్ఫ్‌లు అన్ని కల్తీ చేస్తు్న్నారు కేటుగాళ్లు. ఆఖరుకు మనం తినే అన్నంలో ప్లాస్టిక్‌ రైస్‌ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొందరు కంత్రీగాళ్లు..ఈ క్రమంలోనే కాస్త కొత్తగా కనిపించిన మరో మోసం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక్కడ కొంత మంది వ్యక్తులు పాత అరిగిపోయిన టైర్లను ప్యాకింగ్ చేసి తక్కువ సమయంలో కొత్తవిగా మార్చేందుకు సిద్ధం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఒక వ్యక్తి పాత అరిగిపోయిన టైర్‌ను కొత్తదిగా మార్చేస్తున్నాడు. అరిగిపోయిన టైర్‌ని టూల్‌తో కట్ చేసి, దాన్ని శుభ్రం చేసి కొత్తదిలా తయారు చేస్తున్నాడు. దీని తరువాత అది ప్లాస్టిక్ కవర్‌తో ప్యాక్ చేశాడు. దానిపై లేబుల్ కూడా చేశాడు. ప్యాక్ చేసిన తర్వాత, ఈ టైర్ కొత్తదా లేదా పాతదా అని తెలుసుకోవడం కష్టం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడిది అనే దానికి సంబంధించిన సమాచారం తెలియలేదు.. దుకాణదారుడు ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నాడా లేదా ఇది వ్యాపారమా అనేది కూడా స్పష్టంగా లేదు. ఈ వీడియోపై చాలా మంది నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది ఈ వ్యక్తి పనితనం కాదని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఒకరు రాశారు. ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మరొకరు రాశారు. ఎవరికి తెలుసు ఇలాంటి వాళ్లు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. టైర్ కొనేటపుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఒకరు రాశారు. ఈ టైర్ అతివేగంతో తిరిగినప్పుడు పగిలిపోతే ఆ వాహనదారుడు చనిపోయే ప్రమాదం ఉందని మరో వ్యక్తి రాశాడు. అది తప్పు కానీ, ఈ మనిషి పనితనం అమోఘం అని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..