AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anvesh – Sunny Yadav: అన్వేష్, భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం.. ఇద్దరిలో ఎవరు కరెక్ట్..

యూట్యూబ్ వ్లాగర్స్ పంచాయితీ పీక్‌కి చేరింది. బయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా.. అదంతా ఉత్తదే అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో గొడవ మొదలైంది. అయితే తమ మధ్య నాలుగేళ్ల నుంచే గొడవలు ఉన్నాయి అంటున్నాడు అవినాష్.

Anvesh - Sunny Yadav: అన్వేష్, భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం.. ఇద్దరిలో ఎవరు కరెక్ట్..
Anvesh - Sunny Yadav
Ram Naramaneni
|

Updated on: Mar 26, 2024 | 9:56 AM

Share

ఇద్దరు ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ మధ్య గొడవ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలికి చెందిన అన్వేష్ కాగా.. మరొకరు తెలంగాణకు చెందిన బయ్యా సన్నీ యాదవ్.  నా అన్వేషణ అన్వేష్..  160 పైగా దేశాలను చుట్టి వచ్చా డు. అక్కడి విభిన్న ఆచార వ్యవహరాలను.. వారి జీవన విధాన్ని చూపించే ప్రయత్నం చేసేవాడు. భయ్యా సన్నీ యాదవ్ బైక్‌ వివిధ దేశాలు వెళ్తూ.. తన ప్రయాణ విశేషాలు పంచుకుంటూ ఉండేవారు. ఇద్దరికీ కూడా ఓ రేంజ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల సన్నీ యాదవ్‌ తాను బైక్‌పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశాడు. అదంతా బూటకమన్న అవినాష్‌.. బైక్‌ను లాటిన్ అమెరికా వరకు షిప్‌లో పంపి.. అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు. దీంతో సన్నీ యాదవ్‌ చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అయ్యాడు. అవినాష్ తనపై బేస్ లెస్ ఆరోపణలు చేశాడంటూ తనదైన రీతిలో బూతులతో కౌంటర్ ఇచ్చాడు.

ఈ సారి అవివాస్ గొడవను కాస్త పర్సనల్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ సారి సన్నీ యాదవ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సన్నీ.. ఓ అమ్మాయిని మోసం చేశాడని.. ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపాడు. అంతేకాదు మరో కడపకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాం లేపుకు పోయినట్లు తెలిపాడు. ట్రేడింగ్, బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రొత్సహిస్తూ.. డబ్బుల కక్కర్తితో పిల్లలను నాశనం చేస్తున్నట్లు సన్నీ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యాడు అన్వేష్. అయితే తన పర్సనల్ విషయాలు తీయడంపై అవినాష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సన్నీ యాదవ్. ఇలా వీరిద్దరూ  ఒకదాని వెంట ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడిద్దో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..