Daggad Sai: “విశ్వాసం లేదు”.. తెలుగు బిగ్ బాస్ విన్నర్‌పై దగడ్ సాయి సంచలన కామెంట్స్
బోయిన్ పల్లి దగడ్ సాయికి రాష్ట్రవ్యాప్తంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందకే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఆయన సపోర్ట్ కోరుతూ ఉంటారు. సాయి కూడా ఏమీ ఆశించకుండా వారికి మద్దతు తెలుపుతూ ఉంటారు. అయితే బిగ్ బాస్‌కి వెళ్లివచ్చిన తర్వాత కొందరు యాటిట్యూబ్ చూపిస్తున్నారని సాయి చెబుతున్నాడు.
బిగ్ బాస్.. అనేది తెలుగులో మస్త్ జనాల ఫాలోయింగ్ ఉన్న షో. ఈ షోకి వెళ్లి జీరోలు హీరోలు, హీరోలు జీరోలు అయ్యారు. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ జరిగింది. అయితే బిగ్ బాగ్ వెళ్లేవారు.. ముందుగానే బయట పీఆర్‌లను పెట్టుకునే ట్రెండ్ బయట నడుస్తుంది. అంతేకాదు.. బయట మంచి ఫాలోయింగ్, పలుకుబడి ఉన్నవారిని కూడా తమకు హెల్ప్ చేయాలని, సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు వేయాలని కోరుతూ ఉంటారు. అలానే తెలంగాణ యూత్‌లో బాగా పాపులారిటీ ఉన్న దగడ్ సాయిని ఇప్పటికీ వరకు చాలామంది అప్రోచ్ అయ్యారు. అతను కూడా ఏమీ ఆశించకుండా తన వద్దకు వచ్చే అందరికి సపోర్ట్ చేసేవారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి.. సీజన్ 1 పక్కనబెడితే.. సీజన్ 2 నుంచి సీజన్ 7 వరకు చాలామంది కంటెస్టెంట్స్ తన సపోర్ట్ కోరినట్లు తెలిపాడు. వారిలో సీజన్ 6 వరకు అందరూ తనతో బానే టచ్‌లో ఉన్నారని తెలిపాడు. అయితే సీజన్ 7లో సపోర్ట్ చేసిన కంటెస్టెంట్ మాత్రం గెలిచినా కూడా ఇప్పటివరకు వచ్చి కలవలేదని.. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని దగడ్ సాయి తెలిపాడు.
బిగ్ బాస్ వల్ల సొసైటీ ఏం యూజ్ లేదని.. కేవలం కొందరు తెలిసినవాళ్ల ఒత్తడి వళ్లే సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పాడు సాయి. బిగ్ బాస్‌కి పోయిన తర్వాత కొందరిలో అహంకారం పెరిగి.. సెలబ్రిటీల మాదిరిగా ఫీల్ అవుతుంటారని చెప్పుకొచ్చాడు. కాగా దగడ్ సాయి చెప్పింది పల్లవి ప్రశాంత్ గురించే అని స్పష్టంగా అర్థమవుతుంది.
View this post on Instagram
ఎందుకో పల్లవి ప్రశాంత్ చుట్టూ తొలి నుంచి పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. బిగ్ బాస్‌కి వెళ్లిన కొత్తలోనే అతడిని నా అన్వేషణ అన్వేష్ విమర్శించాడు. అతడు.. బిగ్ బాస్ విన్నర్ అయి బయటకు వచ్చిన తర్వాత ప్రవర్తన సరిగా లేదని చాలామంది యూట్యూబర్స్ తిట్టిపోశారు. ఇక తన ప్రవర్తన కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు దగడ్ సాయి సైతం ప్రశాంత్‌పై అసహనం వ్యక్తం చేశాడు. మరి దీనికి పల్లవి నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..