AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డు మీద బైక్ నడుపుతూ ఇదేం పని.. తిట్టి పోస్తున్న నెటిజన్లు

కొంతమంది గొప్ప చదువుకుంటారు. గొప్ప గొప్ప సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ కామన్ సెన్స్ ఉండదు. తమ గురించే సరిగ్గా ఆలోచించని వాళ్లు.. పక్కవాళ్ల గురించి ఆలోచిస్తారు అనుకోవడం అత్యాసే అవతుంది. ముందుగా మీరు ఈ వీడియో చూడండి....

Viral Video: రోడ్డు మీద బైక్ నడుపుతూ ఇదేం పని.. తిట్టి పోస్తున్న నెటిజన్లు
man attends work call while riding
Ram Naramaneni
|

Updated on: Mar 26, 2024 | 12:10 PM

Share

ప్రజంట్ చాలామంది జీవితాలు ఉరుకులు, పరుగులతో సాగిపోతున్నాయి. చాలా హెక్టిక్ షెడ్యూల్. జీతం వేటలో పడి.. జీవితాన్ని చాలా టెన్షన్‌తో గడుపుతున్నారు. అలాంటి ఓ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ.. ల్యాప్‌టాప్‌లో జూమ్‌ కాల్‌కు హాజరయ్యాడు. ఒడిలో ల్యాప్ టాప్ పెట్టి… బైక్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. “బెంగళూరు బిగినర్స్‌కు కాదు” అని దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ఈ విచిత్రమైన క్లిప్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.  ఇది చూసిన కొందరు ఆ వ్యక్తిపై ఫైరవుతున్నారు. మరి అంత అర్జెంట్ కాల్ అయితే ఓ పక్కన స్కూటీ ఆపి అటెండ్ అవ్వాల్సింది కదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మీ లాంటి వల్లే ప్రమాదాలు జరిగేవి. మీకు, ఎదుటివారికి కూడా ఇది డేంజర్. అతనిపై యాక్షన్ తీసుకోవాలని మరొకరు కామెంట్ చేశారు. మా సాఫ్ట్‌వేర్ కష్టాలు ఇలానే ఉంటాయని మరొకరు పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అలాంటివి.. కొన్నిసార్లు ఇలాంటివి మాకు తప్పవు అని ఓ బెంగళూరు వ్యక్తి వ్యాఖ్యానించాడు.  ఈ వీడియో మార్చి 23న ట్విట్టర్ పోస్ట్ చేయగా.. లక్ష కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.  వీడియో దిగువన చూడండి…

ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా ఇలా చేయకూడదు. మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంట్. మరీ మిమ్మల్ని ఇలా కూడా పని చేయించే బాస్ ఉంటే ఆ ఉద్యోగం మానేసి ఇంకోటి వెతుక్కోండి. మీ కోసం ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. జీవితంలోనూ,,, రోడ్డు మీద సేఫ్ జర్నీ చేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!