గోదారి ఉరకలు… ప్రాణహిత పరవళ్ళు
The Pranahita River is Overflowing : మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, నదులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్టల్రోని ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఈ వరద నీరు గోదావరి నదిలో కలువడంతో త్రివేణి […]
![గోదారి ఉరకలు... ప్రాణహిత పరవళ్ళు](https://images.tv9telugu.com/wp-content/uploads/2020/07/Pranahita.jpg?w=1280)
The Pranahita River is Overflowing : మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, నదులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా జలకళతో ఉట్టిపడుతున్నాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్టల్రోని ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఈ వరద నీరు గోదావరి నదిలో కలువడంతో త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద వరద నీరు పెరుగుతోంది.
నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని వాతావరణశాఖ చెబుతోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో తేలికపాటి వర్షాలుకురుస్తాయని తెలిపింది. ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.